
న్యూఢిల్లీ: ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్‌లో సిల్వర్ మెడల్స్ సాధించిన ఇండియా షూటర్లు తిలోత్తమ సేన్, అర్జున్బబూతపారిస్ ఒలింపిక్స్‌కు క్వాలిఫై అయ్యారు. శుక్రవారం జరిగిన మెన్స్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో 24 ఏండ్ల అర్జున్251.2 స్కోరుతో రెండో ప్లేస్‌తో సిల్వర్ నెగ్గాడు. అనంతరం టీమ్ ఈవెంట్‌లో దివ్యాన్ష్ సింగ్, హజారికాతో కలిసి ఇండియాకు గోల్డ్ అందించాడు. విమెన్స్10 మీ. ఎయిర్ రైఫిల్ ఫైనల్లో 15 ఏండ్ల తిలోత్తమ 252.3 స్కోరుతో రెండో ప్లేస్‌తో సిల్వర్‌తో పాటు ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది.