అర్థరాత్రి ఒంటి గంట వరకు షాప్స్, రెస్టారెంట్లు ఓపెన్

అర్థరాత్రి ఒంటి గంట వరకు షాప్స్, రెస్టారెంట్లు ఓపెన్

బెంగళూరు సిటీ దుకాణాలు,వ్యాపారసంస్థలు, హోటళ్లు ఇకపై అర్థరాత్రి ఒంటి వరకు కూడా తెరిచి ఉంటాయి. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్వయంగా ప్రకటించారు. వ్యాపార గంటల పొడిగించినట్లు తన బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. అర్థరాత్రి దాటిన తర్వాత కూడా వ్యాపారాలను అనుమతించాలని హోటల్ యజమానుల సంఘంతో పాటు వివిధ వాణిజ్య సంస్థలు చేసిన అభ్యర్థనలతో సీఎం సిద్దరామయ్య ఈ ప్రకటన చేశారు. 

బెంగళూరును ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చేయడానికి, ప్రజల జీవన నాణ్యతను మెరుగు పర్చేందుకు , పెట్టుబడి దారులను ఆకర్షించేందుకు వివిధ రంగాల్లో పెద్ద సంస్కరణలు చేస్తున్నామని ఇందులో భాగంగా నే బెంగళూరు సహా పది కార్పొరేషన్ లలో అర్థరాత్రి ఒంటి గంట వరకు హోటళ్లు, అన్ని వాణిజ్య సంస్థలకు అనుమతిస్తున్నామని సీఎం సిద్ధరామయ్య చెప్పారు. 

బెంగళూరులో వనరుల పెంపుదల, ట్రాఫిక్ రద్దీనీ తగ్గించడం, నాణ్యమైన రోడ్ల నిర్మాణం, స్వచ్ఛమైన తాగునీటి సరఫరా, మెరుగైన ప్రజా రవాణా , స్వచ్చమైన, అందమైన బెంగళూరు ను తీర్చిదిద్దుతామని సీఎం సిద్దరామయ్య స్పష్టం చేశారు.