షాప్సీకి 45 కోట్ల యూజర్లు

షాప్సీకి 45 కోట్ల యూజర్లు

హైదరాబాద్​, వెలుగు: తమ యాప్‌‌ను 45 కోట్లకు పైగా వినియోగదారులు డౌన్‌‌లోడ్ చేసుకున్నారని, చిన్న నగరాల్లోనూ సంస్థ కార్యకలాపాలను విస్తరించామని ఫ్లిప్‌‌కార్ట్ అనుబంధ సంస్థ షాప్సీ  తెలిపింది. మనదేశంలో సంస్థ నాలుగు సంవత్సరాల ప్రయాణం పూర్తయిన సందర్భంగా ఈ విషయాలను  వెల్లడించింది. భారతీయ వినియోగదారులకు తక్కువ ధరలో షాపింగ్ అనుభవాన్ని అందించేందుకు  కృషి చేస్తున్నామని ఈ ఫ్యాషన్​ రిటైలర్​ తెలిపింది. 

చిన్న పట్టణాల నుంచి పెరుగుతున్న డిమాండ్‌‌ను తీర్చడానికి, విస్తరించడానికి కంపెనీ సిద్ధంగా ఉందని పేర్కొంది. దేశంలోని 19 వేల పిన్​కోడ్లలో డెలివరీ ఇస్తున్నామని తెలిపింది. ఈ ఒక్క సంవత్సరంలోనే, 11.5 మిలియన్లకు పైగా కొత్త దుకాణదారులు షాప్సీలో చేరారని ప్రకటించింది.