రహస్యంగా డేటింగ్!: బాలీవుడ్ బ్యూటీపై కన్నేసిన శ్రేయాస్ అయ్యర్

రహస్యంగా డేటింగ్!: బాలీవుడ్ బ్యూటీపై కన్నేసిన శ్రేయాస్ అయ్యర్

బాలీవుడ్ ముద్దుగుమ్మలకు, స్టార్ క్రికెటర్లకు మధ్య డేటింగ్ అనేది సర్వసాధారణమే. ఈ వ్యవహారం ఎప్పటి నుంచో జరుగుతూనే ఉంది. వీరిలో కొంతమంది పెళ్లి వరకు వెళ్తే మరి చాలా వరకు డేటింగ్ తో సరిపెట్టేస్తారు. తాజాగా టీమిండియా క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్ ఒక బాలీవుడ్ బ్యూటీ విషయంలో ఆసక్తి చూపిస్తున్నాడని సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఆమె ఎవరో కాదు ముంబై ముద్దుగుమ్మ శ్రద్ధా కపూర్.
 
శ్రద్ధా కపూర్, అయ్యర్ ఇద్దరూ కూడా ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు ఫాలో చేసుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. దీంతో నెటిజన్స్ వీరి మధ్య ఏదో ఉందని అప్పుడే అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. 'వీళ్లు రహస్యంగా డేటింగ్ చేస్తున్నారా?' అని అభిమాని ఒకరు అంటుంటే.. అమ్మో...ఇద్దరి మధ్య ఖచ్చితంగా ఏదో జరుగుతుందని మరొకరు రాశారు. 

ఇటీవలే బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ లో చోటు కోల్పోయిన అయ్యర్.. మార్చి 2న తమిళనాడు తో ప్రారంభమైన రంజీ ట్రోఫీ 2024 సెమీ ఫైనల్‌లో ఆడాడు. ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్ లో కేవలం మూడు పరుగులే చేసి సందీప్ వారియర్ బౌలింగ్ లో బౌల్డయ్యాడు.    ఇంగ్లాండ్ తో జరిగిన తొలి రెండు టెస్టుల్లో అయ్యర్ వరుసగా 35, 13, 27, 29 పరుగులు చేశాడు. దీంతో సిరీస్ లోని మిగిలిన మ్యాచ్ లకు దూరమయ్యాడు. అయ్యర్ గత 12 నెలల నుంచి వెన్ను నొప్పితో ఇబ్బంది పడుతున్నారు. గత ఏడాది (2023) మార్చిలో వెన్నులో శస్త్రచికిత్స చేయించుకున్నాడు ఈ క్రమంలో IPL 2023 తో పాటు WTC ఫైనల్‌కు దూరమయ్యాడు. 2023 ఆసియా కప్ కు భారత జట్టులో చేరాడు.