ఏపీలో శ్రీ సిమెంట్ ప్లాంట్ ​ప్రారంభం

ఏపీలో శ్రీ సిమెంట్ ప్లాంట్ ​ప్రారంభం

హైదరాబాద్: శ్రీసిమెంట్​ ఆంధ్రప్రదేశ్‌‌‌‌లోని గుంటూరు జిల్లా దాచేపల్లి గ్రామంలో రూ. 2,500 కోట్ల పెట్టుబడితో నిర్మించిన కొత్త ఇంటిగ్రేటెడ్ ప్లాంట్‌‌‌‌ను ప్రారంభించింది. దీనివల్ల ఉత్పత్తి సామర్థ్యం మూడు మిలియన్​ టన్నుల నుంచి 56.4 మిలియన్​ టన్స్​పర్​ యానమ్​(ఎంటీపీఏ)లకు పెరిగింది.

 గుంటూరు ప్లాంట్‌‌‌‌ శ్రీ సిమెంట్‌‌‌‌కు దేశంలోనే ఆరవ ఇంటిగ్రేటెడ్‌‌‌‌ ప్రొడక్షన్‌‌‌‌ ఫెసిలిటీగానూ, కర్ణాటకలోని కోడ్లా తర్వాత దక్షిణ ప్రాంతంలో రెండో స్థానంలోనూ నిలవనుంది. తెలంగాణ,  ఆంధ్రప్రదేశ్‌‌‌‌ మార్కెట్ల అవసరాలను తీర్చడానికి ఉపయోగపడే ఈ ప్లాంటు దాదాపు 700 ప్రత్యక్ష ఉద్యోగాలు,  1300 పరోక్ష ఉద్యోగాలను సృష్టించగలదని అంచనా.