శ్రీ కృష్ణుడి ధీరత్వంపై వస్తున్న సినిమా ‘శ్రీ కృష్ణ అవతార్ ఇన్ మహోబా’

శ్రీ కృష్ణుడి ధీరత్వంపై వస్తున్న సినిమా ‘శ్రీ కృష్ణ అవతార్ ఇన్ మహోబా’

అభయ్ చరణ్ ఫౌండేషన్, శ్రీజీ ఎంటర్‌‌టైన్‌‌మెంట్ కలిసి మైథలాజీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శుక్రవారం ఈ చిత్రానికి ‘శ్రీ కృష్ణ అవతార్ ఇన్ మహోబా’ టైటిల్‌‌ను అనౌన్స్ చేశారు. ముకుంద్ పాండే దర్శకత్వం వహిస్తుండగా, అనిల్ వ్యాస్ నిర్వహణ బాధ్యతలు చూసుకుంటున్నారు. ఢిల్లీ ఇస్కాన్‌‌కు చెందిన  ప్రీచర్  జితామిత్ర ప్రభు శ్రీ ఆశీస్సులతో ఈ నవ్య కావ్యం రూపొందుతోందని మేకర్స్ తెలియజేశారు. 

ఇది 11-12వ శతాబ్దాల నాటి 'మహోబా' సాంస్కృతిక వైభవాన్ని, అలాగే భగవాన్ శ్రీ కృష్ణుడి దివ్యత్వాన్ని, ధీరత్వాన్ని, ఆధ్యాత్మిక ప్రభావాన్ని చుపించబోతోందని అన్నారు. చలన చిత్ర పరిశ్రమలో తొలిసారిగా శ్రీ కృష్ణుడిని ఒక యుద్ధవీరుడి పాత్రలో చూపించబోయే సినిమా ఇది అని చెప్పారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను ప్రకటిస్తామన్నారు.