
హైదరాబాద్ వేదికగా ఉప్పల్ స్టేడియంలో కివీస్ తో జరుగుతోన్న తొలి వన్డే మ్యాచ్ లో టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ సెంచరీ బాదాడు. 87 బంతుల్లో సెంచరీ సాధించాడు. గిల్ వన్డే కెరీర్లో ఇది 3వ సెంచరీ కాగా, స్వదేశంలో రెండోది. ఈ సెంచరీతో గిల్ మరొక రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టీమిండియా ప్లేయర్లలో తక్కువ ఇన్నింగ్స్ లో (19) వెయ్యి పరుగుల పూర్తిచేసుకున్న ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు.
టిక్నర్ వేసిన 32.4 ఓవర్‌కు గిల్ ఫోర్ బాది వన్డేల్లో 1000 పరుగులు పూర్తి చేశాడు. అంతకుముందు కోహ్లీ, ధావన్ 24 ఇనింగ్స్‌లో ఈ ఘనత సాధించారు. ఓవరాల్‌గా చూస్తే పాకిస్తాన్ క్రికెటర్ ఫకార్ జమాన్ (18) ఇన్నింగ్స్‌ల్లో తొలి స్థానంలో ఉండగా.. ఇమామ్ ఉల్ హక్‌తో కలిసి గిల్ రెండో స్థానంలో నిలిచాడు.