Cricket World Cup 2023: హాస్పిటల్‌లో గిల్.. పాకిస్థాన్ మ్యాచుకు అనుమానమే   

Cricket World Cup 2023: హాస్పిటల్‌లో గిల్.. పాకిస్థాన్ మ్యాచుకు అనుమానమే   

టీమిండియా యువ సంచలనం, స్టార్ ఓపెనర్ శుభమన్ గిల్ వరల్డ్ కప్ లో తొలి మ్యాచ్ ఆడేందుకు ఇంకా సమయం పట్టేలా కనిపిస్తుంది. వరల్డ్ కప్ ముందు డెంగ్యూ బారిన పడ్డ గిల్ ఆస్ట్రేలియాతో తొలి మ్యాచుకు దూరమైన సంగతి తెలిసిందే. అయితే గిల్ ఇంకా కోలుకోకపోవడంతో ఆఫ్ఘనిస్తాన్ తో జరిగే రేపటి మ్యాచుకు గిల్ దూరం కానున్నాడని.. చెన్నై నుంచి ఢిల్లీకి వెళ్లట్లేదని బీసీసీఐ ఈ మేరకు స్పష్టం చేసింది. 

ఇదిలా ఉండగా.. ఇప్పుడు పాకిస్థాన్ తో జరిగే మ్యాచుకు కూడా ఈ యువ ఓపెనర్ అందుబాటులో ఉండే సూచనలు కనిపించడం లేదు. ప్రస్తుతం చెన్నై హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న గిల్.. కోలుకోవడానికి మరింత సమయం పడుతుందని వైద్యుడు రిజ్వాన్ ఖాన్ తెలిపాడు. "గిల్  చెన్నైలోని కావేరి హాస్పిటల్ లో ఉన్నాడు. అతని ప్లేట్ లెట్స్ చాలా తక్కువగా ఉన్నాయి. అతను కోలుకోవడానికి మరో వారం సమయం పడుతుంది".  అని వైద్యులు సూచించారు.

Also Read :- టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న బంగ్లాదేశ్

కాగా.. వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీకి గిల్ సేవలు కోల్పోవడం టీమిండియాకు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. గిల్ ప్రస్తుతం అత్యుత్తమ ఫామ్ లో ఉన్నాడు. గత మ్యాచులో గిల్ లేని లోటు స్పష్టంగా కనిపించింది. గిల్ స్థానంలో ఇషాన్ కిషాన్ ఆసీస్ తో జరిగిన మ్యాచులో  డకౌట్ గా  వెనుదిరిగాడు. కాగా.. భారత్-ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ రేపు (అక్టోబర్ 11) ఢిల్లీలో.. పాకిస్థాన్ తో పోరు అక్టోబర్ 14 న గుజరాత్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతాయి.