బోల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అంటే బ్యాడ్ కాదు

బోల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అంటే బ్యాడ్ కాదు

ఒకే ఒక్క సినిమాతో బిజీ హీరోయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయిపోయింది కృతీశెట్టి. ‘ఉప్పెన’లో బేబమ్మ పాత్ర ఆమెకి వరుస అవకాశాలను తెచ్చిపెట్టింది. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీబిజీగా ఉంది. తాను నటించిన ‘శ్యామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సింగరాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ సినిమా రీసెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా రిలీజై సక్సెస్ కావడంతో కాసేపు ఇలా ముచ్చటించింది కృతి.

రీసెర్చ్ చేస్తా

నా పాత్రలపై ముందు నేను రీసెర్చ్ చేస్తున్నాను. ఆ క్యారెక్టర్ ఎలా ఉంటుంది, అలవాట్లు ఏంటి.. అన్నీ తెలుసుకుంటాను. ‘ఉప్పెన’లో బేబమ్మ పాత్ర కోసం చాలా తెలుగు సినిమాలు చూశాను. అలాంటి క్యారెక్టర్స్ చేయాలంటే ట్రెడిషన్ గురించి, కల్చర్ గురించి తెలియాలి. నాకేమో విలేజ్ అమ్మాయిలు ఎలా ఉంటారో తెలీదు. అందుకే ఎక్కువ స్టడీ చేయాల్సి వచ్చింది. ఇక ‘శ్యామ్ సింగరాయ్’  సినిమాలోని పాత్రకి తల్లి ఉండదు. తండ్రి పెంపకం. అలాంటి అమ్మాయి కాస్త మగరాయుడిలా ఉంటే బాగుంటుందని నేనే డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి చెప్పాను. ఇంగ్లిష్ సినిమాలు చూశాను. మోడర్న్ అమ్మాయిలు ఎలా బిహేవ్ చేస్తారో తెలుసుకుని నా స్టైల్లో నటించాను.

ఆ క్షణంలో వణికిపోయా!

ఈ మూవీలో నాని ఓ షార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫిల్మ్ తీస్తారు. అందులో నేను పెయింటింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేసే అమ్మాయిగా నటిస్తాను. నిజానికి నాకు పెయింటింగ్ అంతగా రాదు. కానీ మైండ్ ఫ్రీ అవ్వడానికి నేర్చుకోవాలనిపిస్తూ ఉంటుంది. ఈ మూవీలో నేను సిగరెట్లు కాల్చాను. నిజానికి నాకు స్మోకింగ్ నచ్చదు. అందుకే ఆ సీన్స్ తీసేయమని డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని అడిగాను. ఆయనేమో కృతికీ, కీర్తికీ తేడా ఉండాలి కదా అన్నారు. నాకోసం ఆరోగ్యసేతు సిగరెట్లు తీసుకొచ్చారు. వాటిలో మింట్ ఫ్లేవర్ మాత్రమే ఉంటుంది. వాటితో మూడు రోజులు ప్రాక్టీస్ చేశాను. ఫస్ట్ డే స్మోకింగ్ సీన్‌‌‌‌ తీసినప్పుడు నా చేతులు వణికిపోయాయి.

నాని సూపర్

నానిని అందరూ నేచురల్ స్టార్ అని ఎందుకంటారో ఆయనతో పని చేశాక అర్థమైంది. పాత్రలో లీనమైపోతారు. అందుకే అంత నేచురల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా చేస్తారు. రెండు రకాల పాత్రల్నీ అద్భుతంగా పండించారు. అయితే నాకు మిడిల్ క్లాస్ అబ్బాయి, నిన్ను కోరి సినిమాల్లోని నాని అంటే ఇష్టం. సెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నన్ను చాలా ఎంకరేజ్ చేసేవారు. తన గురించి మాత్రమే చూసుకోరు. అందరి పర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫార్మెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నీ పరిశీలిస్తారు. బాగా చేస్తే బాగుందని చెబుతారు. అందుకే కంఫర్టబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా అనిపించింది నాకు.

చేస్తే తప్పేంటి!

బోల్డ్ సీన్స్ అనగానే బ్యాడ్ అనుకుంటారు. అందులో తప్పేంటో నాకసలు అర్థం కాదు. అయినా ఏం చేసినా మేము సినిమా కోసమే చేస్తాం. అది మా వృత్తి. యాక్షన్ సీక్వెన్సుల్లో ఎంత కష్టపడతామో మిగతా సీన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కీ అంతే కష్టపడతాం. అన్ని సీన్లలోనూ నటించినట్టే ఈ సన్నివేశాల్లోనూ నటిస్తాం. వాటిని ప్రత్యేకంగా చూసి తప్పుబట్టడం నాకు నచ్చదు. కథకి ఆ సీన్స్ అవసరం అనిపిస్తే నేను తప్పకుండా చేస్తాను. లేదంటే చేయను. శ్యామ్ సింగ రాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కథకి ఆ సీన్స్ అవసరం. అందుకే చేశాను.

అన్నీ చేస్తా

ఏ సినిమా చేసినా స్టోరీ కంటే నా పాత్ర ఇంపార్టెన్స్ గురించే ఎక్కువ ఆలోచిస్తాను. ఎంత ప్రాధాన్యత ఉంటుంది, ఇంటర్వెల్ వరకే ఉంటుందా, ఆ తరువాత కూడా ఉంటుందా ఉండదా అని ఆలోచించను. అలాగే రకరకాల పాత్రలు చేస్తే ఎంతో నేర్చుకునే అవకాశం ఉంటుంది. కామెడీ పాత్రలను చేస్తే ఆ టైమింగ్ తెలుస్తుంది. అందుకే అన్ని రకాల పాత్రలూ చేయాలనుంది. కానీ ఏ పాత్రయినా ప్రేక్షకులకు నచ్చుతుందనుకుంటేనే చేస్తా. ఆ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే వాళ్లు నాకు ఎంతో ప్రేమనిచ్చారు. మరి వాళ్లు కోరుకునేది వారికి ఇవ్వాలిగా!

బేబమ్మే కావాలంటే..

ఉప్పెన సినిమాలో నాకు నటించే స్కోప్ ఎక్కువగా ఉంది. అందుకే ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వాల్వ్ అయిపోయా. అయితే ఆ సినిమా తర్వాత నాకు అలాంటి పాత్రలే ఎక్కువగా వచ్చాయి. దాంతో నో చెప్పేశాను. అయినా మళ్లీ మళ్లీ అలాంటి పాత్రనే ప్రేక్షకులకు ఎందుకు చూపించాలి! బేబమ్మే కావాలంటే వాళ్లు నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ‘ఉప్పెన’ సినిమా చూసుకుంటారు కదా. ఈసారి కొత్తగా రావాలనే ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమాని ఎంచుకున్నాను.  అయితే నాకంటే సాయిపల్లవి చేసిన పాత్రే నాకు ఎక్కువ నచ్చింది. చాలా బాగా చేశారామె. నేను కూడా కూచిపూడి డ్యాన్స్ నేర్చుకుంటున్నాను. అందుకే ఆ పాత్రతో మరింత కనెక్టయ్యాను. డబ్బింగ్ కూడా నేనే చెప్పుకుందామనుకున్నాను కానీ సూట్ కాలేదు. కాస్త బేస్ వాయిస్ కావాలన్నారని వేరే వారితో చెప్పించుకున్నా.