Telusu Kada Box Office: ‘తెలుసు కదా’ డే 1 షాకింగ్‌ కలెక్షన్స్.. సిద్దు జొన్నలగడ్డ మూవీకి ఎన్ని కోట్లంటే?

Telusu Kada Box Office: ‘తెలుసు కదా’ డే 1 షాకింగ్‌ కలెక్షన్స్.. సిద్దు జొన్నలగడ్డ మూవీకి ఎన్ని కోట్లంటే?

సిద్దూ జొన్నలగడ్డ, రాశి ఖన్నా మరియు శ్రీనిధి శెట్టి నటించిన లేటెస్ట్ మూవీ తెలుసు కదా. శుక్రవారం (అక్టోబర్ 17, 2025న) థియేటర్లలోకి వచ్చిన ఈ రొమాంటిక్ కామెడీ డ్రామా మిక్సెడ్ టాక్ తెచ్చుకుంది. ఈ క్రమంలో మూవీ ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు మిడియం రేంజ్ వసూళ్లు సాధించింది.

ట్రేడ్ ట్రాకర్ల అంచనాల ప్రకారం, 

తెలుసు కదా ఇండియాలో తొలి రోజున రూ.2 కోట్లకి పైగా నెట్ వసూలు సాధించింది. కేవలం తెలుగు రాష్ట్రాలలో మాత్రమే రిలీజ్ కావడం వల్ల.. వసూళ్లు నెమ్మదిగా ప్రారంభమైనట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

తెలుగు థియేటర్లలో మొత్తం 27.92% ఆక్యుపెన్సీని తెలుసు కదా నమోదు చేసింది. ఉదయం షోలకు 23.52% నుండి ప్రారంభమై, మధ్యాహ్నం 24.75%కి స్వల్పంగా పెరిగింది, తర్వాత సాయంత్రం 24.42%కి చేరుకుని, చివరికి రాత్రి షోలకు 38.99% గరిష్ట స్థాయికి చేరుకుంది. 

అయితే, ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 3.5 కోట్ల నుంచి 5 కోట్ల మేరకు గ్రాస్ అందుకునే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. అలాగే, ఫస్ట్ డే వచ్చిన 80% పాజిటివ్ టాక్.. కాస్తా రెట్టింపు ఐతే.. ఈ వీకెండ్ లో కలెక్షన్స్ పెంచుకునే ఛాన్స్ కనిపిస్తుందని అంటున్నారు. కాగా.. ఇవాళ (అక్టోబర్ 18న) మూవీ ప్రొడక్షన్ హౌస్ నుంచి గ్రాస్ వసూళ్లు ప్రకటించే ఛాన్స్ ఉంది.

ఇకపోతే.. ఈ మూవీతో పాటు రిలీజైన ప్రదీప్ రంగనాధన్ 'డ్యూడ్' ఫస్ట్ డే వసూళ్లలో దూకుడు కనబరిచింది. ఇండియాలో డ్యూడ్ దాదాపు రూ.10 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది. తెలుగులో రూ.3.25 కోట్ల నెట్ వసూళ్లతో.. తెలుసు కదా మూవీని బీట్ చేసింది.

కథేంటంటే:

వరుణ్ (సిద్ధూ జొన్నలగడ్డ) అనాధ. రెస్టారెంట్‌ బిజినెస్ నిర్వహిస్తుంటాడు. ఈ క్రమంలో పెళ్లి, పిల్లల ద్వారా కంప్లీట్ ఫ్యామిలీ అవ్వాలనుకుంటాడు. అలా వరుణ్ ఒక మ్యాట్రిమోనియల్ సైట్ ద్వారా అంజలి (రాశీ ఖన్నా)ను పెళ్లి చేసుకుంటాడు. కానీ తను తల్లి కాలేదని తెలుస్తుంది.

ఈ క్రమంలో సరోగసీ ద్వారా పిల్లలు కావాలనుకుంటారు. డాక్టర్ రాగ (శ్రీనిధి శెట్టి) సరోగసీ మదర్ అవ్వడానికి ఒప్పుకుంటుంది. అయితే ఆమె వరుణ్ మాజీ ప్రియురాలు అని తెలుస్తుంది. అయితే, వరుణ్- రాగల ప్రేమ ఎలా విడిపోయింది? డాక్టర్ రాగా కుమార్‌ సరోగసికి ఎందుకు రెడీ అయ్యింది? వరుణ్ లైఫ్ లోకి రాగ ఎంట్రీ ఇచ్చాక.. ఎదురయ్యే పరిణామాలే మిగతా కథ.