Tillu Square Release Trailer: ప్రతిసారి జంబల్ హాట్ లేడీస్ని..ఎక్కడ పడతావ్రా టిల్లు

Tillu Square Release Trailer: ప్రతిసారి జంబల్ హాట్ లేడీస్ని..ఎక్కడ పడతావ్రా టిల్లు

గతేడాది ఫిబ్రవరిలో ‘డీజే టిల్లు’గా ఆడియన్స్ ముందుకొచ్చి సూపర్ సక్సెస్‌‌ను అందుకున్నాడు సిద్ధు జొన్నలగడ్డ(Siddu Jonnalagadda). ‘డీజే టిల్లు’కు సీక్వెల్‍గా ఇప్పుడు ‘టిల్లు స్క్వేర్’(Tillu Square) సినిమా తెరకెక్కుతోంది.

మల్లిక్ రామ్ (MallikRam) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ అయ్యి ఆడియన్స్ లో అంచనాలు పెరిగిపోయాయి. సాంగ్స్, పోస్టర్స్, టీజర్ ఇలా ప్రతిఒక్కటీ ఇంట్రెస్ట్ పెంచుతూ వస్తున్నాయి. అంతేకాకుండా సిద్దు,అనుపమ ఇంటర్వూస్ కి ఆడియన్స్ లో హైప్ క్రియేట్ అయింది. 

తాజాగా ఈ సినిమా నుంచి టిల్లు స్క్వేర్ రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది.ఈ ట్రైలర్ కూడా ఏ మాత్రం డోస్ తగ్గకుండా హీట్ అంతకుఅంత పెంచేసింది. 

ట్రైలర్ విషయానికి వస్తే..'మార్కస్ చెప్పు..పెట్టిర్రు ఇప్పుడే పెద్ద ముద్ద..మల్లనా అన్న..అంటూ సెటైర్ డైలాగ్ తో షురూ ఆయింది. టిల్లు ఫాధర్ మళ్ళా ఏ పంచాయితీలా ఇరుక్కున్నావ్రా అడిగిన వెంటనే..అనుపమతో రొమాన్స్ షురూ చేశాడు టిల్లు. అంటే,అనుపమ చేతిలో టిల్లు బలయినట్లు చూపించారు.అంతేకాదు..ప్రతి ఒక్కరి యాక్టింగ్..ఉరకలు..ప్రతిసారి ఎక్కడ పడతావ్ రా ఇలాంటి జంబల్ హాట్ లేడీస్ని' అంటూ ప్రిన్స్ డైలాగ్ ఆకట్టుకుంటుంది.   

మొత్తానికి ఎలక్ట్రిఫైయింగ్ టిల్లు స్క్వేర్ రిలీజ్ ట్రైలర్ చూస్తుంటే..టిల్లు గాడు..డబుల్ టైం పిచ్చెకించే విధంగా..డబుల్ టైం నవ్వుకునే విధంగా ఆకట్టుకుంటోంది. సిద్ధు జొన్నలగడ్డ స్టైల్, డైలాగ్ డెలివరీ స్వాగ్, హీరోయిన్స్తో రొమాంటిక్ యాంగిల్స్ ట్రైలర్లో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచాయి.

ఈ సినిమాకు రామ్ మిర్యాలతో పాటు అచ్చు రాజమణి మ్యూజిక్ అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‍మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై టిల్లు స్క్వేర్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ మూవీ మార్చి 29 న థియేటర్స్ లోకి రానుంది.