Badass First Look: సిద్ధూ జొన్నలగడ్డ 'బడాస్' ఫస్ట్ లుక్ వైరల్: మాస్ అవతార్‌లో రచ్చ!

Badass First Look:  సిద్ధూ జొన్నలగడ్డ 'బడాస్' ఫస్ట్ లుక్ వైరల్: మాస్ అవతార్‌లో రచ్చ!

'డీజే టిల్లు'తో యూత్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న నటుడు సిద్దు జొన్నలగడ్డ ( Siddu Jonnalagadda ).  తన నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు.  ఇప్పుడు మరో చిత్రంతో అలరించేందుకు రెడీ అవుతున్నారు.  తన తదుపరి చిత్రం 'బడాస్' తో ప్రేక్షకులను  మెప్పించేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ( Badass' First Look) ను  మూవీ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.  ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ మారింది.

ఈ మూవీని సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్నారు.  రవికాంత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ 'బడాస్'  వచ్చే ఏడాది విడుదల కానుంది. " మీరు హీరోలను, విలన్లను చూశారు. కానీ  ఇప్పుడు వారికి మించి చూస్తారు. ఈసారి కనికరం లేకుండా ఫైర్ సెట్ చేస్తాడు' అంటూ నిర్మాణ సంస్థ X లో పోస్ట్ చేసింది. ఈ పస్ట్ లుక్ పోస్టర్ లో సిద్ధు కళ్ళద్దాలు పెట్టుకుని , సిగరెట్ వెలిగిస్తూ మాస్ లుక్ లో చూట్టూ టీవీ కెమెరాలతో కనిపిస్తున్నారు.  ఈ సినిమా సిద్దు కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో, మాస్ ఇమేజ్‌ను పెంచే లక్ష్యంతో రూపొందుతుందని నిర్మాతలు పేర్కొన్నారు. ఈ  సినిమా టైటిల్, పోస్టర్‌లు చూస్తేనే ఇది ఒక హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ అని అర్థమవుతోందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. 

 

డీజే టిల్లు తర్వాత వరుస పరాజయాలతో ఉన్న సిద్ధూ జొన్నలగడ్డ..  మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నారు.  ఇటీవల విడుదలైన 'జాక్' మూవీ కూడా అశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ప్రస్తుతం నీరజ కోన దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'తెలుసు కదా' చిత్రంలో నటిస్తున్నారు.  హీరోయిన్లుగా శ్రీనిధి శెట్టి, రాశీ ఖన్నా అలరించనున్నారు. ఈ సినిమా ఆక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకురానుంది.  మరి ఈ చిత్రమైనా సిద్ధూకు విజయాన్ని తెచ్చిపెడుతుందో లేదో చూడాలి..

►ALSO READ | War 2: వార్ 2 షూటింగ్ పూర్తి: హృతిక్, ఎన్టీఆర్‌ల భావోద్వేగ పోస్ట్‌లు వైరల్!