War 2: వార్ 2 షూటింగ్ పూర్తి: హృతిక్, ఎన్టీఆర్‌ల భావోద్వేగ పోస్ట్‌లు వైరల్!

War 2:  వార్ 2 షూటింగ్ పూర్తి: హృతిక్, ఎన్టీఆర్‌ల భావోద్వేగ పోస్ట్‌లు వైరల్!

టాలీవుడ్ టు బాలీవుడ్ ప్రేక్షకులను ఉర్రూతలూగించడానికి సిద్ధమవుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'వార్ 2' ( War 2 ) షూటింగ్ పూర్తయింది. ఈ సందర్భంగా హీరో హృతిక్ రోషన్ ( Hrithik Roshan )  సోషల్ మీడియాలో పంచుకున్న భావోద్వేగ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. 149 రోజుల పాటు సాగిన చిత్రీకరణ అనుభవాలను, చిత్ర బృందం పడిన కష్టాన్ని వివరిస్తూ, తన సహనటులు జూనియర్ ఎన్టీఆర్ ( Jr NTR)  , కియారా అద్వానీ ( Kiara Advani ) లకు కృతజ్ఞతలు తెలిపారు.  భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.  

అంకితభావం, కష్టానికి ప్రతిరూపం 'వార్ 2'
"వార్ 2 కోసం కెమెరాలు ఆగిపోయినప్పుడు అనేక రకాల భావోద్వేగాలతో నిండిపోయింది నా మనసు అంటూ హృతిక్ రోషన్ తన షూటింగ్ వివరాలను X వేదికగా పంచుకున్నారు. 149 రోజుల అవిశ్రాంతమైన ఛేజింగ్‌లు, యాక్షన్ సన్నివేశాలు, డ్యాన్సులు, రక్తం, చెమట, గాయాలు... ఇవన్ని తమ ప్రయాణంలో చాలా విలువైనవి" తన పోస్ట్‌లో పేర్కొన్నారు.  సినిమా కోసం చిత్ర బృందం ఎంత కష్టపడిందో తన మాటలు ద్వారా స్పష్టం చేస్తున్నాయి. ప్రతిరోజూ కొత్త సవాళ్లను ఎదుర్కొంటూ, అత్యుత్తమ అవుట్‌పుట్ కోసం శ్రమించిన తమ కృషికి తగిన ఫలితం దక్కుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

 

ఎన్టీఆర్, కియారాపై హృతిక్ ప్రశంసలు
తనతో కలిసి నటించిన జూనియర్ ఎన్టీఆర్  గురించి మాట్లాడుతూ, "తారక్ సర్, మీతో కలిసి పనిచేయడం, ఇంత ప్రత్యేకమైన సినిమాను సృష్టించడం నిజంగా చాలా గౌరవంగా ఉందని అని హృతిక్ అన్నారు.  వీరిద్దరి కాంబినేషన్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ నటనకు, అంకితభావానికి హృతిక్ ముగ్దుడయ్యారని తన  మాటలు తెలియజేశారు. అలాగే, హీరోయిన్ కియారా అద్వానీ గురించి ప్రస్తావిస్తూ, "ప్రపంచం మీలోని లీథల్ సైడ్‌ను చూడబోతున్నందుకు నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. మీతో స్క్రీన్ షేర్ చేసుకోవడం అద్భుతంగా ఉంది" అని హృతిక్ ప్రశంసించారు. కియారా ఈ సినిమాలో సరికొత్త అవతారంలో కనిపించనుందని ఆయన హింట్ ఇచ్చారు.

ALSO READ : రజనీకాంత్ కూలీ అప్డేట్.. తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?

ఆది, అయాన్ విజన్‌కు అభినందనలు
దర్శకుడు అయాన్ ముఖర్జీ ,  నిర్మాణ సంస్థ యాష్ రాజ్ ఫిల్మ్స్ ఆదిత్య చోప్రా గురించి హృతిక్ మాట్లాడుతూ, "ఆది, అయాన్‌ల అద్భుతమైన సినిమాటిక్ విజన్‌ను మీరందరూ చూడటానికి వేచి ఉండలేను!" అని అన్నారు. దర్శకుడి విజన్, నిర్మాణ విలువలు ఈ సినిమాను మరో స్థాయికి తీసుకువెళ్తాయని ఆయన పేర్కొన్నారు.  "వార్ 2 నటీనటులకు, సిబ్బందికి మీ ప్రతిభను పంచుకున్నందుకు, ప్రతిరోజూ మీ శక్తిని పూర్తిగా వెచ్చించినందుకు ధన్యవాదాలు" అని హృతిక్ పేర్కొన్నారు. తన పాత్ర కబీర్ గురించి ప్రస్తావించారు.  మళ్లీ నేను నాలా మామూలుగా అవ్వడానికి కొన్ని రోజులు పడుతుంది"  అని పేర్కొన్నారు. 

హృతిక్ నుంచి చాలా నేర్చుకున్నా..

సోమవారం ( జూలై 7, 2025) జూనియర్ ఎన్టీఆర్ తన షెడ్యూల్ పూర్తయిన సందర్భంగా ఇన్‌స్టాగ్రామ్ లో వార్ 2 షూటింగ్ వివరాలను పంచుకున్నారు. హృతిక్ రోషన్ సర్ తో సెట్ లో ఉండటం ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటుంది. అతని శక్తిని నేను ఎప్పుడూ ఆరాధించే విషయం. ఈ వార్ 2 ప్రయాణంలో నేను అతని నుంచి చాలా నేర్చుకున్నాను అని X వేదికగా పంచుకున్నారు. 

 2025 ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా  వార్ 2 విడుదల కానుంది.  ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.   మరోవైపు అదే రోజు రజినీకాంత్ ( Rajinikanth ) మూవీ 'కూలీ' ( coolie ) మూవీ  కూడా ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.  ఈ రెండు సినిమాలపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి బాక్సాఫీస్ వద్ద ఎవరు విజయం సాధిస్తారో వేచిచూడాలి.