సైడ్ బిజినెస్లతో నెట్టుకొస్తున్నరు

సైడ్ బిజినెస్లతో నెట్టుకొస్తున్నరు

న్యూయార్క్ సిటీలో నగదు కొరత తీవ్రం
కొత్త వ్యాపారాల దిశగా చిన్న బిజినెస్ కంపెనీలు
మెయిన్ దందా నడవక సైడ్ ప్రాజెక్టులపై దృష్టి

న్యూయార్క్: న్యూయార్క్ సిటీ వీధులకు చీకటంటే ఏమిటో తెలీదు. బిజినెస్ సెంటర్లన్నీ 24 గంటలు జన సంచారంతో సందడిగా ఉంటాయి. రెస్టారెంట్లలో కొత్త కొత్త రుచులు ఘుమఘుమలాడుతుంటాయి. ఇదంతా కరోనా రాకముందున్న పరిస్థితి.. ఇప్పుడు అక్కడ నగదు కొరత తీవ్రమైంది. ఫ్యాషన్ డిజైనర్లు ఫేస్ మాస్కులు కుడుతున్నరు, రెస్టారెంట్లన్నీ గ్రోసరీ స్టోర్లుగా మారాయి. డిస్టిలరీలు శానిటైజర్లకోసం ఆల్కహాల్ తయారు చేస్తున్నాయి. కింగ్స్ కౌంటీ డిస్టిలరీ తన మెయిన్ బిజినెస్ మూసేసి, శానిటైజర్ల తయారీకి అనుమతి తెచ్చుకుంది. మెడికల్ ప్రమాణాల ప్రకారం ఆల్కహాలు తయారు చేయడానికి డిస్టిలరీలో కొన్ని మార్పులు చేశామని కో–ఫౌండర్ కాలిన్ స్పోయిల్మేన్ చెప్పారు. కింగ్స్ కౌంటీ ఫస్ట్
బ్యాచ్ గా వెయ్యి బాటిళ్ల హేండ్ శానిటైజర్ తయారు చేయగా, నాలుగు గంటల్లోనే అమ్ముడుపోయిందన్నారు. దీంతోపాటు ఆన్లైన్లో విస్కీ అమ్మకాలు జరుపుతున్నట్లు చెప్పారు.

ఆన్ లైన్ లో జిమ్ పాఠాలు
జిమ్ లకు వెళ్లి బాడీ షేప్ మారకుండా చూసుకోవాలనుకున్నా వీలు కాని పరిస్థితి. న్యూయార్క్ స్వెర్వ్ అనే జిమ్ ట్రైనింగ్ సంస్థ షట్లర్లు దించేసింది. ఎక్సర్ సైజ్ కోరుకునే వాళ్లకోసం శానిటైజ్డ్ సైకిళ్లను అద్దెకిస్తోంది. నెలకు 325 డాలర్లు చెల్లిస్తే ఆన్లైన్ క్లాసుల్లో జిమ్ చేసుకునేలా చాలా సంస్థలు ఏర్పాటు చేశాయి. క్లాస్ ఒక్కంటికీ 10 డాలర్లు తీసుకుని ఆన్లైన్లోనే సూచనలిస్తున్నాయి.

కొత్త ట్రెండ్‘డిస్టెన్స్ డైనింగ్’
స్టూడెంట్లకు, ఆఫీసు సిబ్బందికి లంచ్ సప్లయ్ చేసే చైనీస్ జుంజీ కిచెన్ కూడా ఇప్పుడు బిజినెస్ స్టయిల్ మార్చుకుంది. గతంలో మన్ హట్టన్ వరకే సర్వీసు చేసేది. ఇప్పుడు దూర ప్రాంతాలకు వండిన ఆహారం బదులుగా విడివిడిగా దినుసుల సర్వీసు అందిస్తోంది. ఇలాంటి కొత్త కొత్త ఐడియాలతో ఇప్పుడు సైడ్ బిజినెస్ నే మెయిన్ బిజినెస్ గా మార్చేసుకుంటున్నారు న్యూయార్క్ వ్యాపారులు.

ఫేస్ షీల్డ్స్ ఇప్పుడు హాట్ బిజినెస్
న్యూయార్క్ లోని చిన్నవ్యాపార సంస్థలు ప్రధానంగా ఆసుపత్రులపైనే దృష్టిపెట్టాయి. అక్కడి సిబ్బందికి కావలసిన అత్యవసర సరుకులు, సర్వీసులు అందించగలుగుతున్నాయి. మెడికల్ డివైజ్లలో ఉపయోగించే కంప్యూటర్ కాంపొనెంట్లను తయారు చేసే అదాఫ్రూట్ కంపెనీ ఇప్పుడు ఫేస్ షీల్డ్ (ముఖానికి వేసుకునే గ్లాస్ కవచం) తయారీలోకి దిగింది. ఇప్పుడు ఆదాఫ్రూట్, మేకర్ఫేస్ లాంటివి న్యూయార్క్ సిటీ ఎకనామిక్ డెవలప్మెంట్ కార్పొరేషన్తో కలిసి ఫేస్ షీల్డులు తయారు చేస్తున్నాయి. ఇలాంటి ఎనిమిది సంస్థలతో ఎన్వైసీఈడీసీ వారానికి 2 లక్షల ఫేస్ షీల్డులు తయారు చేయించే పనిలో పడింది. కరోనా ఎఫెక్ట్ నుంచి తమ కంపెనీల్ని, సిబ్బందిని కాపాడుకోవడానికి చిన్న చిన్న సంస్థలన్నీ కొత్త ఐడియాలతో ముందుకు పోతున్నాయి.

For More News..

చనిపోయిన వాళ్లకు కరోనా టెస్టులొద్దు

గ్రీన్‌ జోన్‌లోకి తెలంగాణలోని ఏడు జిల్లాలు

12 జిల్లాల్లో పూల్‌ టెస్టులు

లాక్డౌన్ పెంచడానికి కారణం అదే..