రష్యా స్పుత్నిక్ –వీ తో సైడ్ ఎఫెక్ట్స్..ముందే తెలుసన్న ఆరోగ్యశాఖ మంత్రి

రష్యా స్పుత్నిక్ –వీ తో సైడ్ ఎఫెక్ట్స్..ముందే తెలుసన్న ఆరోగ్యశాఖ మంత్రి

రష్యా కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్ ‌‌–వీ భద్రతపై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రపంచ దేశాలకు చెందిన సైంటిస్ట్ లు కరోనా వ్యాక్సిన్లను తయారు చేస్తున్నారు.

వ్యాక్సిన్ తయారు చేసిన అనంతరం మూగజీవాలపై, ఆ తరువాత మనుషులపై ప్రయోగిస్తారు. మనుషుల్లో వివిద దశల వారీగా వయసును బట్టి మూడు సార్లు టెస్ట్ లు చేస్తారు. ఆ టెస్ట్ ల్లో వ్యాక్సిన్ వేయించుకున్న వాలంటీర్ల ఆరోగ్యం బాగుంటేనే..ఆ వ్యాక్సిన్ ను వినియోగంలోకి తెచ్చేందుకు ఆయా దేశాద్యక్షులు ప్రయత్నిస్తారు.

కానీ రష్యా వ్యాక్సిన్ మాత్రం స్పుత్నిక్ – వీ పూర్తిస్థాయిలో హ్యూమన్ ట్రయల్స్ నిర్వహించకుండానే విడుదల చేసింది. తాజాగా స్పుత్నిక్ –వీ వ్యాక్సిన్ వేయించుకున్న వాలంటీర్లకు అనారోగ్య సమస్యలు తలెత్తినట్లు రష్యా ఆరోగ్యశాఖ మంత్రి మిఖాయిల్ ముష్కో తెలిపారు.

వ్యాక్సిన్ వేయించుకున్న ఏడుగురు వాలంటీర్లలో కండరాల నొప్పి, కళ్లు తిరగడంలాంటి సమస్యలు తలెత్తాయని చెప్పారు. స్పుత్నిక్ – వీ మూడో దశ హ్యూమన్ ట్రయల్స్ లో 300మంది వాలంటీర్లు పాల్గొన్నారని, వారిలో 14శాతం మందికి అనారోగ్య సమస్యలు తలెత్తడమే కాదు, సైడ్ ఎఫెక్స్ చూపించడాన్ని తాము ముందే ఊహించినట్లు చెప్పిన మిఖాయిల్ అవి ఒకటి, ఒకటిన్నర రోజుల్లో తగ్గిపోతాయని చెప్పారు.