హైడ్రాక్సీక్లోరోక్విన్ తో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి

హైడ్రాక్సీక్లోరోక్విన్ తో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి

వాషింగ్టన్ : కరోనా కు హైడ్రాక్సీక్లోరోక్విన్ ను దివ్య ఔషధంగా ప్రపంచ దేశాలు భావిస్తుంటే అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ డీఏ) మాత్రం దీంతో సైడ్ ఎఫెక్ట్స్ తప్పవని హెచ్చరిస్తోంది. క్లోరోక్విన్ కారణంగా పేషెంట్లకు గుండె సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని తెలిపింది. ఈ ఎఫెక్ట్ ను దృష్టి లో పెట్టుకొని పేషెంట్లను ట్రీట్ చేయాలని చెబుతోంది. కరోనా పేషెంట్ పరిస్థితిని బట్టి డాక్టర్లే ఏ మందు ఇవ్వాలనేది నిర్ణయించాలని సూచించింది. ఎమర్జెన్సీ సందర్భాల్లో మాత్రమే హైడ్రాక్సీక్లోరోక్విన్ ను ఇవ్వాలని ఎఫ్ డీఏ సూచించింది. ఈ డ్రగ్ వాడటంపై డాక్టర్లకు పూర్తి వివరాలు అందుబాటులో ఉంచాల్సిన అవసరముందని తెలిపింది. ఇప్పటికే క్లోరిక్విన్ ప్రభావం అంతగా లేదని అమెరికా లో ఓ స్డడీలో తేల్చారు. తాజాగా ఎఫ్ డీఏ సైతం కేర్ ఫుల్ గా హైడ్రోక్సీక్లోరోక్విన్ ను వాడాలని సూచిస్తోంది. సైడ్ ఎఫెక్ట్ ఉన్న కారణంగానే చాలా రకాల మందులను కరోనా ట్రీట్ మెంట్ కు సిఫారసు చేయలేదని తెలిపింది. ఐతే క్లోరోక్విన్ మాత్రమే కరోనా నుంచి కాస్త రిలీఫ్ అయ్యేందుకు ఉపయోగపడుతోందని చాలా దేశాలు భావిస్తున్నాయి. అమెరికా సహా 30 దేశాలు ఇండియా నుంచి ఈ డ్రగ్ ను దిగుమతి చేసుకున్నాయి.