గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌‌ని విచారిస్తున్న పోలీసులు

గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌‌ని విచారిస్తున్న పోలీసులు

పంజాబ్ సింగర్ సిద్ధూ మూసేవాలా మృతదేహాన్ని మాన్సా సివిల్ ఆస్పత్రి నుంచి తరలించారు. తల్లిదండ్రులకు మృతదేహాన్ని అప్పగించారు. అక్కడ నుంచి మృతదేహాన్ని సిద్ధూ స్వ గృహానికికి తరలించారు. మాన్సా సివిల్ ఆస్పత్రిలో ఐదుగురు సభ్యుల బృందం పోస్టుమార్టం నిర్వహించింది. సిద్ధూ డెడ్ బాడీలో 24 బుల్లెట్ గాయాలు ఉన్నట్లు పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైంది. ఇటు సిద్ధూను కడసారి చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు. మాన్సా సివిల్ ఆస్పత్రి వద్దకు లక్షల మంది అభిమానులు  తరలివచ్చారు. ఈ కేసు దర్యాప్తును ముమ్మరం చేసిన పోలీసులు ఇప్పటి వరకు ఆరుగుర్ని అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరాఖండ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్, పంజాబ్ సిట్ అధికారు జాయింట్ ఆపరేషన్ తో నిందితులను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

మరోవైపు తీహార్ జైల్లో ఉన్న గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ని అధికారులు విచారిస్తున్నారు. మూసేవాలా హత్యకు బాధ్యత వహిస్తున్న కెనడాకు చెందిన గ్యాంగ్ స్టర్ గోల్డీ బ్రార్ బిష్ణోయ్ కి సన్నిహితుడుగా గుర్తించారు. ఈ ఘటన దర్యాప్తు కోసం ఇప్పటికే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు సీఎం భగవంత్ మాన్. దీనిపై పంజాబ్, హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాస్తామని చెప్పారు. ఈ కేసులో దోషులను వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు భగవంత్ మాన్. ఇటు వీఐపీలకు భద్రత కుదింపుపై చండీఘఢ్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏ కారణాలతో భద్రత కుదించారో చెప్పాలని భగవంత్ మాన్ సర్కార్ కు ఆదేశాలు జారీ చేసింది. జూన్ 2లోగా వివరణ ఇవ్వాలని సూచించింది.

మరిన్ని వార్తల కోసం :-
స్పైస్ జెట్ కు రూ.10 లక్షల జరిమానా


జస్టిస్ ఫర్ మూసేవాలా.. కాంగ్రెస్, బీజేపీ నిరసనలు