
గోదావరిఖని, వెలుగు : సింగరేణి 54వ జోనల్ మైన్స్ రెస్క్యూ పోటీలు బుధవారం యైటింక్లయిన్ కాలనీలోని ఆర్జీ –2 ఏరియా రెస్క్యూ స్టేషన్లో షురూ అయ్యాయి. సింగరేణి ప్లానింగ్, ప్రాజెక్ట్స్ డైరెక్టర్ కె.వెంకటేశ్వర్లు, డైరెక్టర్ఆఫ్ మైన్స్సేఫ్టి ఉమేశ్ఎం.సావర్కర్పోటీలపు ప్రారంభించి మాట్లాడారు. రెండు రోజులు జరిగే పోటీల్లో వివిధ విభాగాల్లో ప్రతిభ చూపిన టీమ్ లను నాగ్‌పూర్‌లో నిర్వహించే జాతీయ స్థాయి మైన్స్‌రెస్క్యూ పోటీలకు ఎంపిక చేయనున్నట్టు పేర్కొన్నారు.
పురుషుల జట్టుతో పాటు మహిళల జట్టు కూడా పాల్గొని ఎలాంటి ఒత్తిడికిలోను కాకుండా తమ ప్రతిభ చూపాయిన తెలిపారు. పోటీలకు జడ్జిలుగా డీడీఎంఎస్ ఆఫీసర్లు కిషోర్ కుమార్, దిలీప్ కుమార్, షేక్ నాగుల్ మీరా, సనత్ కుమార్, కె.ప్రేమ్ కుమార్, కమలేశ్ కుమార్ వర్మ, కోమల్ చౌదరి, అనికేత్ సింగ్, సుధీర్ కుమార్వ్యవహరిస్తున్నారు. కార్యక్రమంలో సింగరేణి జనరల్మేనేజర్లు చింతల శ్రీనివాస్, సుధాకర్‌రావు, కె.శ్రీనివాస్ రెడ్డి, డి.లలిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.