తళుకుమంటున్న సిల్వర్.. కేజీ రూ.55 వేల పైనే..!

తళుకుమంటున్న సిల్వర్.. కేజీ రూ.55 వేల పైనే..!

ఇండస్ట్రియల్ యాక్టివిటీ
పెరగడంతో ఇన్వెస్టర్ల
చూపు వెండిపై
సిల్వర్ మైనర్లకు పండుగే

వెలుగు, బిజినెస్‌‌డెస్క్ : బంగారం మాదిరి సిల్వర్ కూడా తళుకు తళుకుమని మెరిసిపోతోంది. ఇండియన్ మార్కెట్లలో సిల్వర్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఎంసీఎక్స్ ‌‌ఎక్స్చేంజ్‌ ‌లో సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రేట్లు కేజీకి రూ.1,350 పెరిగి రూ.55,328గా ఉన్నాయి. గత సెషన్‌‌లో కూడా సిల్వర్ ఫ్యూచర్స్ రేట్లు కేజీకిరూ.1,150పెరిగాయి. గ్లోబల్ ‌‌మార్కెట్లలో సిల్వర్ ఒక ఔన్స్‌కు 20 డాలర్ల మార్క్‌ను క్రాస్ చేసింది. 2016 నుంచి ఈ మేర ధరలు పెరగడం ఇదే మొదటిసారి. 2016 ఆగస్ట్‌‌లో సిల్వర్ 20.22 డాలర్లమార్క్‌కు చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఇండస్ట్రియల్ యాక్టివిటీ మళ్లీ పుంజుకుంది. కరోనా వ్యాక్సిన్ త్వరలోనే వస్తుందనే ఆశతో ఇండస్ట్రియల్ యాక్టివిటీ పెరిగింది. దీంతో సిల్వర్‌‌పై ట్రేడర్లు ఎక్కువగా ఫోకస్ చేసినట్టు అనలిస్ట్‌‌లు చెబుతున్నారు. గ్లోబల్ ‌మార్కెట్ రేట్లకు అనుగుణంగా ఇండియాలో కూడా సిల్వర్ రేట్లు పెరుగుతున్నట్టు చెప్పారు. మరోవైపు గతకొన్ని రోజుల నుంచి గోల్డ్ రేట్లు స్థిరంగా ఉన్నప్పటికీ, సిల్వర్ రేట్లు మాత్రం ర్యాలీ చేస్తూనే ఉన్నట్టు కొటక్ సెక్యూరిటీస్ తన నోట్‌లో పేర్కొంది. డాలర్ బలహీనపడటంవల్ల కూడా కమోడిటీలు ఎక్కువగా లాభపడుతున్నాయని చెప్పింది.

ఇన్వెస్టర్ల నుంచి వస్తున్న ఆసక్తే.. సిల్వర్ ‌ధరలు పెరిగేందుకు దోహదం చేస్తోందని అనలిస్ట్‌‌లు చెప్పారు. ఐషేర్స్ ఈటీఎఫ్‌‌లో సిల్వర్ హోల్డింగ్స్ సరికొత్త రికార్డు గరిష్టాలను నమోదు చేశాయి. 118.78 టన్నులు పెరిగి 16,379.08 టన్నులకు సిల్వర్ హోల్డింగ్స్ చేరుకున్నాయి. మెక్సికో, లాటిన్ అమెరికా దేశాల్లో కరోనా వైరస్ వ్యాప్తి భయాందోళనతో సిల్వర్ ‌సప్లయిలరో ఇంకా ఇబ్బం దులు ఉన్నాయని అనలిస్ట్‌‌లు చెప్పారు. సిల్వర్ 19.5 డాలర్లమార్క్‌కు చేరుకున్న కొన్ని రోజుల వ్యవధిలోనే 20డాలర్ల మార్క్‌ను క్రాస్ చేసిందని కొటక్ సెక్యూరిటీస్ తెలిపింది.

ప్యాకేజీ ఆశలతో మెటల్స్‌‌కు డిమాండ్…

గోల్డ్ ‌లాభాలు పెరుగుతున్న కొద్దీ..సిల్వర్ కూడా తన లాభాలను పెంచుకుంటుందని కొటక్ సెక్యూరిటీస్ చెప్పింది. ఎంసీ ఎక్స్‌‌లో ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ 10గ్రాములకు రూ.49,204కు పెరిగింది. ఈ నెలలోనే ఈ రేట్లు రూ.49,348 వద్ద సరికొత్త గరిష్టాన్ని తాకాయి. గ్లోబల్ మార్కెట్లలో గోల్డ్ కూడా తొమ్మిదేళ్ల గరిష్టాన్ని చేరుకుంది. మరింత స్టిములస్ ప్యాకేజీ ఆశలతో గోల్డ్, సిల్వర్ రేట్లు పుంజుకుంటున్నాయి. యూరో పియన్యూనియన్ లీడర్లు భారీ ఎత్తున స్టిములస్ ప్లాన్‌ ను సిద్ధం చేశారు. అమెరికా కూడా ఎకనమిక్ రిలీఫ్ కోసం మరో లక్ష కోట్లడాలర్ల ప్యాకేజీని ప్రకటించాలని రిపబ్లికన్లు కోరుతున్నారు. ప్రభుత్వాలు ప్రకటిస్తోన్న ఈ ప్యాకేజీలతో సిల్వర్, గోల్డ్ ధరలు పెరుగుతున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం..