
న్యూఢిల్లీ: డిమాండ్ పెరగడం, యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందనే అంచనాల మధ్య గురువారం ఢిల్లీలో వెండి ధర రూ. 6,000 పెరిగి కిలో ధర రికార్డుస్థాయిలో రూ. 1,63,000కు చేరింది.
ధర ఇంత భారీగా పెరగడం వారంలో ఇది రెండోసారి. అక్టోబర్ 6న ఇది రూ. 7,400 పెరిగి కిలోకు రూ. 1,57,400 వద్ద ముగిసింది. బుధవారం కిలో వెండి ధర రూ. 1,57,000 వద్ద ముగిసింది.