HBH‌‌‌ వర్సిటీ వాలీబాల్‌‌‌‌ లీగ్‌‌‌‌ విన్నర్‌‎గా‌‌‌‌‌‌‌ సిల్వర్ వోక్స్‌‌‌‌

HBH‌‌‌ వర్సిటీ వాలీబాల్‌‌‌‌ లీగ్‌‌‌‌ విన్నర్‌‎గా‌‌‌‌‌‌‌  సిల్వర్ వోక్స్‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: హైదరాబాద్‌‌‌‌ బ్లాక్‌‌‌‌హాక్స్‌‌‌‌ (హెచ్‌‌‌‌బీహెచ్‌‌‌‌) వర్సిటీ వాలీబాల్‌‌‌‌ లీగ్‌‎లో సిల్వర్‌‌‌‌ వోక్స్‌‌‌‌, డీపీఎస్ (నాచారం) చాంపియన్లుగా నిలిచాయి.  సోమవారం యూసుఫ్‌‌‌‌గూడ ఇండోర్‌‌‌‌ స్టేడియంలో జరిగిన గర్ల్స్‌‌‌‌ఫైనల్లో సిల్వర్‌‌‌‌ వోక్స్‌‌‌‌3–-0తో చిరెక్‌‌‌‌ ఇంటర్నేషనల్‌‌‌‌ స్కూల్‌‌‌‌టీమ్‌‌‌‌ను చిత్తుగా ఓడించింది. బాయ్స్ ఫైనల్లో ది గాడియం స్కూల్‌‌‌‌ 1–3తో డీపీఎస్ చేతిలో ఓడిపోయింది. ఆరు వారాల పాటు సాగిన ఈ లీగ్‌‌‌‌లో సత్తా చాటుతూ  ప్రొఫెషనల్‌‌‌‌ లెవెల్‌‌‌‌ స్కిల్స్ చూపెట్టిన విన్నర్లను బ్లాక్‌‌‌‌హాక్స్‌‌‌‌యాజమాన్యం అభినందించింది.