స్పోర్ట్స్​ నుంచి ఇలాంటి ప్రశ్నలడగొచ్చు

స్పోర్ట్స్​ నుంచి ఇలాంటి ప్రశ్నలడగొచ్చు

పోటీ పరీక్ష ఏదైనా స్పోర్ట్స్​ నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు. త్వరలో జరగనున్న పోలీస్​ పరీక్షలతో పాటు పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​ పరీక్షల్లో క్రీడల నుంచి 2 నుంచి 3 ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ప్రతి నాలుగేండ్లకు ఒక్కసారి జరిగే ఒలింపిక్స్, పారాలింపిక్స్​, వింటర్​ ఒలింపిక్స్​, కామన్వెల్త్​ గేమ్స్​ ఇటీవల జరిగాయి. వీటిపై ప్రశ్నలు అడిగే అవకాశం ఎక్కువగా ఉంది. టోర్నీ జరిగిన ప్రదేశం, విజేతలు, వంటి ప్రశ్నలు మాత్రమే వస్తాయి. ఒలింపిక్స్​​, పారాలింపిక్స్​, వింటర్​ ఒలింపిక్స్​, కామన్వెల్త్​  క్రీడలపై విభిన్న కోణంలో ప్రశ్నలు అడిగే ఆస్కారం ఉంది. 

కామన్వెల్త్​ క్రీడలు 

1930లో తొలిసారి కెనడాలోని హామిల్టన్​లో జరిగాయి. 1998లో తొలిసారి ఆసియా నగరం కౌలాలంపూర్​(మలేషియా)లో జరిగాయి. 2010లో న్యూఢిల్లీ కేంద్రంగా భారత్​ ఈ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చింది. 2020లో బర్మింగ్​హమ్​(ఇంగ్లాండ్​) వేదికగా జరిగాయి. డర్బన్​(దక్షిణాఫ్రికా) ఆర్థిక కారణాలతో వైదొలగగా బర్మింగ్​హమ్​కు అవకాశం దక్కింది. 2026లో ఆస్ట్రేలియాలోని విక్టోరియా నగరంలో జరగనున్నాయి. 

ఆసియా క్రీడలు 

1951లో న్యూఢిల్లీలో ప్రారంభం. వీటినే Asiadగా పిలుస్తారు.2018లో ఇండోనేషియాలో జకార్తా అండ్​ పాలెంబంగ్​ నగరాల్లో జరిగాయి. 
ఆసియా క్రీడలు 2023 సెప్టెంబర్​ 23  నుంచి అక్టోబర్​ 3 వరకు హాగ్జీ (చైనా) వేదికగా జరగనున్నాయి. 
మోటో: Heart to Heart , @ Future
2026 – ఏచి నగోయ (జపాన్​), 2030 – దోహ (ఖతార్​), 2034 – రియాద్ (సౌదీ అరేబియా) 

ఒలింపిక్స్​

ఒలింపిక్స్​ 2020

2021 జూలై 23 నుంచి ఆగస్టు 8 వరకు టోక్యో వేదికగా జరిగాయి. జపాన్​ రాజు నరుహిటో ప్రారంభించగా జపాన్​ టెన్నిస్​ స్టార్​ నవోమి ఒసాకా జ్యోతి ప్రజ్వలన చేసింది. మొత్తం 206 దేశాలు పాల్గొన్నాయి. 33 క్రీడల్లో 339 క్రీడాంశాల్లో పోటీలు జరగ్గా 11,420 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. టోక్యో ఒలింపిక్స్​ మోటో United by Emotion మస్కట్​ Miraitowa. 2020 టోక్యో(జపాన్​) ఈ ఒలింపిక్స్​ 2021లో జరిగినప్పటికీ వీటిని 2020 ఒలింపిక్స్​గానే వ్యవహరించాలని ఇంటర్నేషనల్​ కమిటీ పేర్కొంది. 

2020లో భారత్​ స్థానం

18 క్రీడాంశాల్లో 126 మంది భారతీయ క్రీడాకారులు పాల్గొన్నారు. భారత పతాకధారులుగా ప్రారంభోత్సవంలో మేరికోం(బాక్సింగ్​), మన్​ ప్రీత్​సింగ్​(హాకీ) వ్యవహరించగా, ముగింపు ఉత్సవాల్లో భజరంగ్​ పూనియా(రెజ్లింగ్)​ వ్యవహరించారు. ఈ ఒలింపిక్స్​లో స్వర్ణం సాధించడం ద్వారా ఒలింపిక్స్​ చరిత్రలో అథ్లెటిక్స్​లో పతకం సాధించిన ఏకైక భారతీయుడిగా నీరజ్​చోప్రా నిలిచాడు. ఆగస్టు 8ను జాతీయ జావెలిన్​ త్రో దినోత్సవంగా ప్రకటించింది. 

2021 ఆగస్టు 5న జర్మనీని ఓడించడం ద్వారా కాంస్యం పొందిన హాకీలో కాంస్యం పొందిన భారత పురుషుల జట్టు 41 సంవత్సరాల తర్వాత పతకం సాధించింది. ఈ జట్టుకు మన్​ప్రీత్​సింగ్​ కెప్టెన్​గా వ్యవహరించాడు. 1980 మాస్కో ఒలింపిక్స్​లో భారత హాకీ జట్టు చివరిసారిగా స్వర్ణం సాధించింది. ఒలింపిక్స్​ చరిత్రలో భారత హాకీ జట్టు 8 స్వర్ణాలు, 1 రజతం, మూడు కాంస్యాలు సాధించింది.
2024 పారిస్​(ఫ్రాన్స్​) లండన్​ (1908, 1948, 2012) తర్వాత అత్యధికంగా మూడు సార్లు ఒలింపిక్స్​కు ఆతిథ్యం ఇచ్చిన నగరంగా ఫ్రాన్స్​ ప్రత్యేకత పొందనుంది. 1924 ఒలింపిక్స్​ జరిగి 2024 నాటికి 100 ఏళ్లు పూర్తికానున్నాయి. 2024 పారిస్ క్రీడల నినాదం Games wide Openగా ప్రకటించారు. 2028లో లాస్​ఏంజిల్స్​(అమెరికా), 2032 బ్రిస్బేన్​​(ఆస్ట్రేలియా)లో జరగనున్నాయి. 

పారాలింపిక్స్​ 

దివ్యాంగుల కోసం ఉద్దేశించిన ఈ క్రీడలు తొలిసారి 196‌‌‌‌0లో రోమ్​ (ఇటలీ)లో నిర్వహించారు. 1968 టెలిఅవివ్​ (ఇజ్రాయెల్​)లో జరిగిన పారాలింపిక్స్​లో భారత్​ తొలిసారి పాల్గొంది. 

పారాలింపిక్స్​- 2020

2021 ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్​ 5 వరకు జపాన్​ రాజధాని టోక్యో వేదికగా జరిగాయి. మోటో: Unite by emotions, మస్కట్​: Someity, పాల్గొన్న దేశాలు 162( శరణార్థుల ఒలింపిక్స్​ కమిటీ, రష్యన్​ ఒలింపిక్స్​ కమిటీ కలుపుకొని) పాల్గొన్నది 4403 మంది క్రీడాకారులు. 

ఇండియా ప్లేస్​ 

9 క్రీడాల్లో 54 మంది భారత క్రీడాకారులు పోటీ పడ్డారు. భారత పతాకధారిగా టెక్​చంద్​ (షాట్​ఫుట్, జావెలిన్​త్రో) వ్యవహరించగా, ముగింపు ఉత్సవాల్లో అవని లేఖరా(షూటింగ్​) వ్యవహరించారు. 5 స్వర్ణం, 8 రజతం, 6 కాంస్య పతకాలతో పతకాల పట్టికలో భారత్​ 24వ ర్యాంకులో నిలిచింది. అవని లేఖరా 10 మీటర్ల రైఫిల్​లో స్వర్ణం, 50 మీటర్ల రైఫిల్​లో కాంస్యం సాధించింది. 2021లో మేజర్​ ధ్యాన్​చంద్​ ఖేల్​రత్న, 2022లో పద్మశ్రీకి ఎంపికయ్యారు. బేటీబచావో బేటీ పఢావో రాజస్తాన్​ రాష్ట్ర ప్రచారకర్తగా అవని లేఖరా ఎంపికయ్యారు. 2028లో  లాస్​ ఏంజిల్స్​, 2032లో బ్రిస్బేన్​(ఆస్ట్రేలియా)లో జరగనున్నాయి. 

వింటర్​ ఒలిపిక్స్​-2022

2022 ఫిబ్రవరి 4 నుంచి 20 వరకు చైనాలోని బీజింగ్​ వేదికగా జరిగాయి. ఈ క్రీడల్లో భారత్ పతాకధారిగా వ్యవహరించిన ఆరిఫ్​ఖాన్​ ఒక్కడే పాల్గొన్నాడు. జమ్ముకశ్మీర్​కు చెందిన ఇతను అల్పైన్​ స్కేయింగ్​ క్రీడకు చెందిన వ్యక్తి. హిమాచల్​ప్రదేవ్​కు చెందిన బ్యాట్​ క్రీడకు చెందిన శివకేశవన్​ అత్యధికంగా ఆరుసార్లు వింటర్​ ఒలింపిక్స్​లో పాల్గొన్నాడు.

కామన్​వెల్త్​ గేమ్స్​-2022

2022 జులై 28 నుంచి ఆగస్టు 8 వరకు ఇంగ్లండ్​లో జరిగాయి. 
వేదిక: బర్మింగ్​హమ్​(ఇంగ్లండ్​) 
మోటో: Sport is just the beginning
మస్కట్​: Perry, పాల్గొన్న దేశాలు: 72
క్రీడాకారులు: 774, క్రీడలు: 20 (క్రీడాంశాలు 280) , ప్రధాన వేదిక: అలెగ్జాండర్​ స్టేడియం

నాలుగో స్థానంలో భారత్​..

భారత పతాకధారులుగా ప్రారంభ ఉత్సవాల్లో మన్​ప్రీత్​సింగ్​ (హాకీ), పి.వి.సింధు(బ్యాడ్మింటన్​) వ్యవహరించారు. ముగింపు ఉత్సవాల్లో నికత్​జరీన్​ (బాక్సింగ్), ఆచంట శరత్​ కమల్​(టేబుల్​ టెన్నిస్) వ్యవహరించారు. కామన్వెల్త్​ క్రీడల్లో 201 మంది భారత క్రీడాకారులు 16 క్రీడల్లో పోటీ పడ్డారు. 61 పతకాల( 22 స్వర్ణం, 16 రజతం, 23 కాంస్యం)తో పతకాల పట్టికలో భారత్​ నాలుగో స్థానంలో నిలిచింది. అత్యధికంగా రెజ్లింగ్​ 12, వెయిట్​ లిఫ్టింగ్ 10, అథ్లెటిక్స్​ 8, టేబుల్​ టెన్నిస్ 7, బాక్సింగ్​ 7, బ్యాడ్మింటన్​ 6, జుడో 3, లాన్స్​బేల్స్​, స్క్వాష్​ 2, హాకీ 2, క్రికెట్​ 1, పవర్​ లిఫ్టింగ్​ 1 పతకం పొందింది.