18 లక్షల టన్నుల గోధుమల ఎగుమతి

18 లక్షల టన్నుల గోధుమల ఎగుమతి

న్యూఢిల్లీ: గోధుమ ఎగుమతులను బ్యాన్ చేసిన తర్వాత నుంచి ఈ నెల 22 వరకు 18 లక్షల టన్నులు గోధుమలను వివిధ దేశాలకు ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్ చేశామని ఫుడ్ సెక్రెటరీ సుధాంశు పాండే అన్నారు.   మానవత్వంతో ఆఫ్గానిస్తాన్‌‌‌‌కు సుమారు 33,000 టన్నుల గోధుమలను ఎగుమతి చేశామని పేర్కొన్నారు. ఈ దేశానికి మొత్తంగా 50 వేల టన్నులను ఎక్స్‌‌‌‌పోర్ట్ చేయడానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు.

ఇండియాలోని 138 కోట్ల మంది ఆకలిని తీర్చడంపై ఫోకస్‌‌‌‌ పెట్టడంతో పాటు, వివిధ దేశాల్లోని ఫుడ్ షార్టేజ్‌‌‌‌ గురించి కూడా ఆలోచించామని పాండే అన్నారు. ఆఫ్గానిస్తాన్‌‌‌‌, బంగ్లాదేశ్‌‌‌‌, భూటన్‌‌‌‌, ఇజ్రాయెల్‌‌‌‌,మలేషియా, నేపాల్‌‌‌‌, ఓమన్‌‌‌‌, ఫిలిప్పిన్స్‌‌‌‌, ఖతర్‌‌‌‌‌‌‌‌, సౌత్‌‌‌‌ కొరియా, శ్రీలంక, సూడన్‌‌‌‌, స్విట్జర్లాండ్‌‌‌‌, థాయ్‌‌‌‌లాండ్‌‌‌‌, యూఏఈ, వియత్నాం, ఓమెన్ దేశాలకు గోధుమలను ఎగుమతి చేశామని వివరించారు.