సొంతిల్లు కావాలా.. వద్దా..! సింగరేణి ఉద్యోగుల నుంచి అభిప్రాయ సేకరణ

సొంతిల్లు కావాలా..  వద్దా..! సింగరేణి ఉద్యోగుల నుంచి అభిప్రాయ సేకరణ
  • సింగరేణి కార్మికులు, ఉద్యోగుల నుంచి బ్యాలెట్ ఓటింగ్ ద్వారా అభిప్రాయాల సేకరణ

కోల్​బెల్ట్, వెలుగు: సింగరేణి కార్మికులు, ఉద్యోగులకు సొంతింటి పథకం అమలు చేయాలని డిమాండ్​చేస్తూ ఓటింగ్ కార్యక్రమం నిర్వహించారు. గురువారం మంచిర్యాల జిల్లా మందమర్రి, శ్రీరాంపూర్​ఏరియాల్లోని బొగ్గు గనులు, డిపార్ట్​మెంట్లపై ఓటింగ్​చేపట్టారు.

 సింగరేణి కాలరీస్​ఎంప్లాయీస్​యూనియన్(సీఐటీయూ) ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమంలో భాగంగా ‘ సొంతిల్లు కావాలా.. క్వార్టర్​ కావాలా’ అంశంపై కార్మికులు, ఉద్యోగుల అభిప్రాయాలను బ్యాలెట్​ ఓటింగ్​ ద్వారా సేకరించారు. ఇందు కోసం ఆయా ప్రాంతాల్లో పోలింగ్​ బ్యాలెట్  బాక్స్ లు ఏర్పాటు చేశారు.  ఉద్యోగులు, కార్మికులు స్వచ్ఛందంగా ఓటింగ్​లో పాల్గొన్నారు.

 అనంతరం సీఐటీయూ లీడర్లు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కార్మికులకు సొంతింటి పథకం అమలు చేస్తామని, అన్ని పార్టీలు, కార్మిక సంఘాలు హామీలిచ్చి అధికారంలోకి రాగానే విస్మరిస్తున్నాయన్నారు. కార్యక్రమంలో లీడర్లు ఎస్​. వెంకటస్వామి,అల్లి రాజేందర్​,రామగిరి రామస్వామి,చంద్రశేఖర్​,గుళ్ల బాలాజీ,ప్రకాశ్​,రంజిత్​ కుమార్​,​ప్రవీణ్​,సతీశ్​,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

గోదావరిఖనిలో..

గోదావరిఖని : సీఐటీయూ అనుబంధ సింగరేణి కాలరీస్​ఎంప్లాయీస్ యూనియన్​ఆధ్వర్యంలో ఆర్జీ –1, ఆర్జీ –2, ఆర్జీ –3 ఏరియాల్లోని ఆఫీస్​లు, డిపార్ట్​మెంట్లు, బొగ్గు గనులు, ఓపెన్​కాస్ట్​ ప్రాజెక్ట్​వద్ద సొంతింటిపై ఓటింగ్​నిర్వహించారు.