సొంతంగా ఆక్సిజన్ తయారీపై సింగరేణి కసరత్తు

సొంతంగా ఆక్సిజన్ తయారీపై సింగరేణి కసరత్తు

మంచిర్యాల: ఆక్సిజన్ కొరతను దృష్టిలో పెట్టుకుని సింగరేణి కీలక నిర్ణయం తీసుకుంది. సొంతంగా ఆక్సిజన్ తయారు చేసేందుకు కసరత్తును ప్రారంభించాలని నిర్ణయించింది. పారిశ్రామిక అవసరాల కోసం దశాబ్దాలుగా మహారాష్ట్ర నుంచి ఆక్సిజన్‌ను సింగరేణి దిగుమతి చేసుకుంటోంది. ప్రస్తుత తరుణంలో పారిశ్రామిక అవసరాలతో పాటు కరోనా మహమ్మారి కారణంగా ఆక్సిజన్ కొరత మరీ ఎక్కువ కావడంతో సొంతంగా తయారు చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చింది.