ప్రముఖ తెలుగు, తమిళ సింగర్ మనో ఇద్దరు కుమారులను చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. వారం రోజుల క్రితం జరిగిన గొడవలో పరారైన మనో కొడుకులిద్దరు రఫీ, షకీర్‌ని సెప్టెంబర్ 17న అరెస్ట్ చేశారు పోలీసులు.
అసలేం జరిగిందంటే..సెప్టెంబర్ 10 వలసరవాక్కంలోని శ్రీదేవి కుప్పంలో ఉన్న ఓ రెస్టారెంట్‌లో మనో కొడుకులిద్దరు ఫ్రెండ్స్ తో కలిసి మరో ఇద్దరు వ్యక్తులపై దాడి చేశారు. ఈ ఘటనలో కృపాకరన్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటనలో గాయపడిన కృపాకరన్ ఫిర్యాదు మేరకు మనో ఇద్దరి కొడుకులపై కేసు నమోదు చేశారు వళసరవాక్కం పోలీసులు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు . మరో ముగ్గురు పరారయ్యారు. మనో మేనేజర్, ఇంటి పనిమనిషిని అదుపులోకి తీసుకున్న పోలీసులు..ఇపుడు రఫీ, షకీర్ లను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ టాపిక్ టాలీవుడ్, కోలివుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
మనో దాదాపు నాలుగు దశాబ్దాల నుంచి దక్షిణాదిలో సింగర్.. డబ్బింగ్ ఆర్టిస్టుగా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పటి వరకు 35000 పాటలు పాడారు. అలాగే, 3000 కంటే ఎక్కువ ప్రత్యక్ష వేదికలపై కచేరీలలో పాల్గొన్నాడు. ప్రస్తుతం పాటలతో, అదే సమయంలో సూపర్ సింగర్, ఇండియన్ ఐడల్ వంటి షోలకు న్యాయనిర్ణేతగా కూడా పనిచేస్తున్నాడు