‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో సింగర్‌గా రీ ఎంట్రీ ఇచ్చిన రమణ గోగుల (Ramana Gogula) సెకండ్ ఇన్నింగ్స్ అదిరిపోయేలా ఉంది. వరుస తెలుగు సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి. ‘గోదారి గట్టు మీద రామ సిలక’నే అంటూ ఆయన పాడిన పాటకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. 200 మిలియన్స్కి పైగా దూసుకెళ్లింది.
ఈ క్రమంలోనే రమణ గోగుల.. త్వరలో గ్లోబల్ కాన్సర్ట్ టూర్‌కు రెడీ అయ్యారు. వచ్చే ఏడాది 2026 ఫిబ్రవరిలో ఆస్ట్రేలియా పర్యటనతో ఈ ప్రపంచ యాత్ర ప్రారంభం కానుంది. ఆ తర్వాత యూకే, అమెరికాల్లోనూ పర్యటించనున్నారు.
మెల్‌బోర్న్‌కు చెందిన మామా క్రియేటివ్ స్పేస్, టాప్ నాచ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఆస్ట్రేలియా సంస్థలు ‘‘ఇన్ కాన్వర్సేషన్స్ విత్ ది ట్రావెలింగ్ సోల్జర్ - రమణ గోగుల ఆస్ట్రేలియా టూర్ ఫిబ్రవరి 2026”పేరుతో ఓ భారీ సంగీత యాత్రను ప్రకటించాయి. శనివారం ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌లో ఈ వివరాలను వెల్లడించారు.
►ALSO READ | తమిళ బ్లాక్ బస్టర్ ‘పార్కింగ్’ మూవీ గుర్తుందిగా.. ఇపుడు ఆ హీరో మరో ప్రాజెక్ట్తో.. ఇంట్రెస్టింగ్గా గ్లింప్స్
రమణ గోగులతో పాటు, ఎక్సెల్ గ్లోబల్ సర్వీసెస్ సంస్థ ఎండీ రామ్ కట్టాల, మామా క్రియేటివ్ స్పేస్ వ్యవస్థాపకుడు సతీష్ వర్మ ఈ వరల్డ్ టూర్ వివరాలను తెలియజేశారు. రమణ గోగుల సంగీత ప్రస్థానంలో ఇదొక మైలురాయిగా నిలవనుందని తెలిపారు.
కేవలం సంగీత కచేరీలకే పరిమితం కాకుండా ఆయన ఐకానిక్ పాటల వెనుక ఉన్న జ్ఞాపకాలతో కూడిన ఎమోషనల్ జర్నీని ఇందులో ప్రజెంట్ చేయబోతున్నట్టు వివరించారు. అలాగే ఓ డాక్యుమెంటరీ రెడీ చేసి, ఒక ప్రీమియం ఇండో-ఆస్ట్రేలియన్ మ్యూజికల్ జర్నీగా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో విడుదల చేస్తామని వెల్లడించారు.
