జనజీవన చైతన్యమే కవిత్వం..భాష సంఘం అధ్యక్షురాలు మంత్రి శ్రీదేవి

జనజీవన చైతన్యమే కవిత్వం..భాష సంఘం అధ్యక్షురాలు మంత్రి శ్రీదేవి

 వనపర్తి, వెలుగు: జన చైతన్యం కోసమే కవిత్వం అని తెలంగాణ రాష్ట్ర అధికార భాష సంఘం అధ్యక్షురాలు మంత్రి శ్రీదేవి తెలిపారు. తెలంగాణ సాహితీ, ప్రజానాట్యమండలి, తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో కవికి పట్టాభిషేకం కార్యక్రమం జరిగింది. ప్రముఖ సంఘ‌‌‌‌ సంస్కర్త సురవరం ప్రతాపరెడ్డి జయంతి సందర్భంగా ఆయన ఫొటోకు పూలమాలలు వేసి  నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కవిత్వం ప్రజల హృదయాలను కదిలిస్తుందని, ప్రజల్లో దాగి ఉన్న చైతన్యాన్ని బయటకు తెస్తుందని చెప్పారు. 

కవులు‌‌, గాయకులు సమాజాభివృద్ధి కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. ప్రజల పక్షాన పని చేయాలని, సమాజ హితం కోసం పాటుపడాలని కోరారు. తెలంగాణ సాహితి రాష్ట్ర అధ్యక్షుడు వల్లభాపురం జనార్ధన్, ఉపాధ్యక్షుడు మోహన్ కృష్ణ, సలీమ, జబ్బార్, మురళీధర్, మోహన్ కుమార్ యాదవ్, గంధం నాగరాజు, డి కృష్ణయ్య, రాజారాం ప్రకాశ్, చీర్లనాగేంద్రం
 పాల్గొన్నారు.