
- రేవంత్ కాళ్లు మొక్కారనడం బాధించింది: నిరంజన్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: బ్రహ్మంగారికి సిద్ధయ్య ఎట్లనో.. కేసీఆర్కు హరీశ్ రావు అలాగని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌నేత సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్కు హరీశ్ ఒక సంపద అని, అలాంటి వ్యక్తిని బలహీనపరిచేలా మాట్లాడితే తెలంగాణకు నష్టమని అన్నారు. జలదృశ్యంలో దిమ్మె కట్టించిందే హరీశ్‌రావు అని, ఏ పని చెప్పినా ఎదురు మాట్లాడకుండా చేశారని అన్నారు. మంత్రిగా, ఎమ్మెల్యేగా, కార్యకర్తగా అందరికీ అందుబాటులో ఉండి పనిచేశారన్నారు.
బుధవారం ఆయన తెలంగాణ భవన్లో ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, ముఠా గోపాల్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. నాడు హరీశ్ రావు పనితీరును పొగిడినోళ్లే నేడు ఆరోపణలు చేస్తున్నారని కవితకు కౌంటర్ ఇచ్చారు. వారి మనసెలా ఒప్పుతున్నదోనని అన్నారు. రేవంత్ కాళ్లు మొక్కాడని చెప్పడం చాలా బాధగా అనిపించిందన్నారు. తనవల్లే ఈటల రాజేందర్ టీఆర్ఎస్లోకి వచ్చారని, పార్టీ నుంచి వెళ్లిపోవడానికి హరీశ్ కారణం కాదని పేర్కొన్నారు.