సిర్పూర్లో ఆర్ఎస్. ప్రవీణ్ ఓటమి.. అక్కడ బీజేపీ గెలిచింది..

సిర్పూర్లో ఆర్ఎస్. ప్రవీణ్ ఓటమి.. అక్కడ బీజేపీ గెలిచింది..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీతో పాటు బీఎస్పీ పార్టీ కూడా పెద్దగా ప్రభావం చూపలేదు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా గెలవలేదు. ఆయన సిర్పూర్ నుంచి బరిలో నిలిచారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి పాల్వాయి హరీష్ బాబు ఎమ్మెల్యేగా గెలిచారు. ఈయనకు 63 వేల 702 ఓట్లు వచ్చాయి. 

సిట్టింగ్ ఎమ్మెల్యే కోనేరు కోనప్పను హరీష్ బాబు ఓడించారు. కోనప్పకు 60 వేల 614 ఓట్లు పడ్డాయి.  ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు మాత్రం 44 వేల 646 ఓట్లు వచ్చాయి. ఇక్కడ బీఎస్పీ మూడో స్థానానికే పరిమితమైంది. కాంగ్రెస్ కు మాత్రం 8 వేల 427 ఓట్లు వచ్చాయి. 

ఉమ్మడి ఆదిలాబాద్‍లో త్రిముఖ పోరు కొనసాగింది. ఆదిలాబాద్, నిర్మల్, సిర్పూర్, ముథోల్ బీజేపీ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీఎస్పీ పార్టీ పెద్దగా ప్రభావం చూపలేదు.