
- ట్రాఫిక్ లో చిక్కుకున్న 108
కాగజ్ నగర్, వెలుగు: రైతులందరికీ యూరియా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిర్పూర్ ఎమ్మెల్యే హరీశ్ బాబు సోమవారం కాగజ్‌నగర్‌లోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ ముందు రోడ్డుపై ఆందోళన చేశారు. మార్కెట్ యార్డ్ లోని పీఏసీఎస్‌కు వచ్చిన రైతులతో కలిసి రోడ్డెక్కారు. యూరియా వచ్చాక అందరికీ ఇస్తామని ఏవో రామకృష్ణ చెప్పినా వినలేదు.
దీంతో రెండు వైపులా ట్రాఫిక్ జామ్ కావడంతో ఎమ్మెల్యే ను పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ వెహికల్లోకి ఎక్కించారు. పోలీస్ వెహికల్‌ను రైతులు, మహిళలు అడ్డుకున్నారు. ఈక్రమంలో పెంచికల పేట్ నుంచి గర్భిణిని తీసుకువస్తున్న 108 ట్రాఫిక్‌లో చిక్కుకుంది. పోలీసులు, కొందరు యువకులు స్పందించి అంబులెన్స్ కు దారి ఇచ్చేలా ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. 108 వచ్చినా ఆందోళన కొనసాగించడంపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు.