
జహీరాబాద్, వెలుగు: అన్నయ్య రాఖీ కట్టించుకోలేదని చెల్లెలు ఆత్మహత్య చేసుకుంది. జహీరాబాద్ ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణం చెన్నారెడ్డి కాలనీకి చెందిన బసన్నకు ఇద్దరు కొడుకులు, ఓ కూతురు ఉన్నారు. రెండు రోజులుగా తండ్రి బసన్న, చిన్న అన్నయ్య రమేశ్మధ్య కుటుంబ విషయాల్లో మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. ఆదివారం ఉదయం బసన్న, రమేశ్ఇద్దరూ పొలానికి వెళ్లారు. అన్నయ్య పొలం దగ్గర ఉండటంతో చెల్లెలు మమత(20) అక్కడకు వెళ్లి రాఖీ కట్టేందుకు ప్రయత్నించింది. రాఖీ కట్టించుకునేందుకు రమేశ్ఒప్పుకోకపోవడంతో మమత ఇంటికి తిరిగివచ్చి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తండ్రి బసన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.