ఆపరేషన్ మల్యాల.. కదులుతున్న గ్రూప్1 లీకేజీ డొంక

ఆపరేషన్ మల్యాల.. కదులుతున్న గ్రూప్1 లీకేజీ డొంక
  • ఓవైపు సిట్.. మరో వైపు ఈడీ
  • అనుమానితులను మరోసాకి విచారించనున్న సిట్
  • అభ్యర్థులు, వాళ్ల ఫ్యామిలీ మెంబర్ల ఖాతాలపై ఈడీ కన్ను
  • నిందితుల కాల్ డేటా, టీఎస్పీఎస్సీ డేటాతో ఇన్వెస్టిగేషన్

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ లింకులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. హైకోర్టుకు సిట్ అందించిన స్టేటస్ రిపోర్ట్ తరువాత కూడా సిట్ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతున్నది. ఏఈ పేపర్ లో ఒక్కొక్కరు పట్టుబడుతుండడంతో గ్రూప్ 1 పేపర్ లీకేజీపైనా సిట్ ఫోకస్ పెట్టింది. మల్యాల మండలం టార్గెట్ గా మరోసారి సెర్చ్ ఆపరేషన్స్ ప్లాన్ చేస్తున్నది. గ్రూప్ 1లో 100కు పైగా మార్కులు వచ్చిన వారిని మరోసారి విచారించేందుకు కసరత్తు చేస్తున్నది.

ఈ క్రమంలోనే ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇప్పటికే జగిత్యాల జిల్లా అభ్యర్థుల వివరాలను సేకరించింది. రెండు దర్యాప్తు సంస్థలు మల్యాలలో గ్రూప్ 1 మూలాలను వెలికి తీసేందుకు తుది ప్రయత్నాలు చేస్తునట్లు తెలిసింది. రాజశేఖర్ రెడ్డి కాల్ డేటా,టీఎస్పీఎస్సీలో అప్లై చేసిన అభ్యర్ధుల ఫోన్ నంబర్స్ ఆధారంగా విచారిస్తున్నారు.

నిందితుల కాల్ డేటా, టీఎస్పీఎస్సీ అభ్యర్థుల డేటా లింక్స్ తో..

ప్రవీణ్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డిలు ఇచ్చిన సమాచారంతో గ్రూప్ - 1, అసిస్టెంట్ ఇంజినీర్,డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ పరీక్షలు రాసిన అభ్యర్థుల కోసం సిట్ రాష్ట్ర వ్యాప్తంగా జల్లెడ పడుతున్నది. ఇందులో భాగంగా ఏఈ పేపర్ కొనుగోలు చేసిన గండీడ్ మండలానికి చెందిన తండ్రీ కొడుకులు మైబయ్య, జనార్ధన్ ను శుక్రవారం అరెస్ట్ చేసింది. ఇన్వెస్టిగేషన్లో రోజుకో లింకు బయటపడుతుండడంతో మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నది.

అనుమానితుల పూర్తి వివరాలు రాబడుతున్నది. ఎఫిషియెన్సీ టెస్ట్లో పాటు వారి కుటుంబ నేపథ్యం ఆర్ధికలావాదే వీలను పరిశీలిస్తున్నది. ప్రవీణ్,రాజశేఖర్రె డ్డిల వాట్సాప్ చాటింగ్స్న ఇప్పటికే రిట్రీవ్ చేసింది. సంబంధిత వ్యక్తుల స్టేట్మెంట్స్ కార్డ్ చేసింది. గ్రూప్ 1, ఏఈ, డీఏఓ పేపర్స్ కొన్నవారి చైన్

ఓ వైపు ఢాక్యానాయక్ ద్వారా ఏఈ పేపర్ కొనుగోలు చేసిన అభ్యర్థుల కోసం సెర్చ్ చేస్తూనే మరోవైపు రాజశేఖర్ రెడ్డి ద్వారా చేతులు మారిన గ్రూప్1 పేపర్ వివరాలు రాబడుతున్నది. ఈ క్రమంలోనే ఢాక్యానాయక్ వద్ద ఏఈ పేపర్ కొనుగోలు చేసిన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన నీలేశ్, గోపాల్నాయక్, ప్ర శాంత్రెడ్డి,రాజేంద్రకుమార్, గండీడ్ మండ లానికి చెందిన మైబయ్య ఆయన కుమారుడు జనార్దన్ రెడ్డిలు సహా మీడియేటర్ తిరుపతయ్యను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

డీఏవో పేపర్ కొనుగోలు చేసి సుస్మిత, ఆమె భర్త లౌకిక్ సాయిని కస్టడీకి తీసుకుని విచారించింది. వీరి ద్దరు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఖమ్మంలో సోదాలు చేసింది. వీరి కాల్ డేటాతో దర్యాప్తు చేస్తు న్నది. శుక్రవారం అరెస్ట్ చేసిన మైబయ్య ఆయన కొడుకు జనార్దన్ ను సోమవారం తరువాత కస్టడీకి తీసుకునే అవకాశాలున్నాయి. వీరిచ్చే సమాచారంతో ఇంకా ఎంతమందికి ఏఈ పేపర్ చేరిందనే వివరాలు రాబట్టనున్నారు.