ఫామ్హౌస్ కేసులో తుషార్కు సిట్ నోటీసులు

ఫామ్హౌస్ కేసులో తుషార్కు సిట్ నోటీసులు

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టారన్న కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌‌ (సిట్‌‌) దర్యాప్తును ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా తుషార్కు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 21న సిట్ ఎదుట విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. రామచంద్ర భారతి, ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిల సంభాషణల్లో తుషార్ పేరు పదేపదే రావడంతో అతన్ని విచారిస్తే మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉందని సిట్ భావిస్తోంది. ఈ క్రమంలోనే ఆయనకు సిట్ నోటీసులు జారీ చేసినట్లుగా సమాచారం. తుషార్ ప్రస్తుతం కేరళ ఎన్డీఏ కన్వీనర్గా ఉన్నారు. 

ఫాం హౌస్‌ కేసులోనూ రాజ్‌భవన్‌ను లాగాలని చూశారని ఇటీవల తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కామెంట్స్ చేశారు. అయితే తాము రాహుల్ గాంధీపై పోటీ చేసిన తుషార్ గురించి  మాత్రమే మాట్లాడామని, గవర్నర్ వద్ద పనిచేసిన తుషార్ గురించి కాదని మంత్రి హరీష్ రావు క్లారిటీ ఇచ్చారు. ఈ వ్యవహారంపై గవర్నర్ ఎందుకు మాట్లాడారో తమకు అర్థం కావడం లేదని అన్నారు.