'సీతా రామం' సెకండ్ సింగిల్ వచ్చేసింది

'సీతా రామం' సెకండ్ సింగిల్ వచ్చేసింది

హీరో దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం 'సీతారామం'. 'యుద్దంతో రాసిన ప్రేమకథ' అని ట్యాగ్ లైన్. ఈ మూవీని హను రాఘవపూడి తెరకెక్కిస్తున్నాడు. ఇందులో దుల్కర్ కు జోడీగా మృణాళ్ ఠాకూర్ నటిస్తోంది. స్వప్న సినిమా బ్యానర్ పై వైజయంతీ మూవీస్ సమర్పణలో  అశ్వనీ దత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కీలక పాత్రలో రష్మిక మందన్న కనిపించబోతోంది. ఆగస్టు 5న ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ మళయాల భాషల్లో భాషల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్ మొదలు పెట్టారు.

ఈ మూవీ నుండి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ టీజర్ లతో దుల్కర్ సల్మాన్, మృణాళ్ ఠాకూర్ రొమాన్స్ తో ఆకట్టుకున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ గా 'ఇంతందం దారి మళ్లిందా..' అంటూ సాగే లిరికల్ వీడియోని విడుదల చేశారు. కృష్ణకాంత్ సాహిత్యం అందించిన ఈ మెలోడీకి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు. ఎస్. పి. బి. చరణ్ ఆలపించారు. ఈ సాంగ్ అద్భుతమైన మెలోడీగా ఆకట్టుకుంటోంది. ఈ మూవీలో హీరో సుమంత్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రకాష్రాజ్ గౌతమ్ మీనన్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.