సీతారామ ప్రాజెక్టు ప్రధాన కాలువ లీకులు

 సీతారామ ప్రాజెక్టు ప్రధాన కాలువ లీకులు

ములకలపల్లి, వెలుగు: మండలంలోని పూసుగూడెం సీతారామ ప్రాజెక్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ పంపుల ద్వారా ఖమ్మం జిల్లాకు  భద్రాద్రి జిల్లా నీళ్లు తరలించే కాల్వ లీకుల మయంగా మారిందని బీజేపీ మండల అధ్యక్షుడు శంకర్ నాయక్ ఆరోపించారు. సోమవారం బీజేపీ మండల నాయకులు పూసుగూడెం సీతారామ ప్రధాన నీటి కాల్వను వారు పరిశీలించారు. 

ఈ సందర్భంగా శంకర్ నాయక్ మాట్లాడుతూ...  సీతారామ ప్రాజెక్టు ప్రధాన కాలువ ద్వారా వస్తున్న నీళ్లు మండలంలోని వి కె రామవరం గ్రామపంచాయతీ  కొత్తూరు గ్రామం నుంచి పూసుగూడెం వరకు చాలా చోట్ల లీకులు వల్ల నీళ్లు వృథాగా పోతున్నాయన్నారు. ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ తక్షణమే స్పందించి మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు.  ప్రధాన కార్యదర్శి పూనెం నవీన్ కుమార్, శ్రీను మల్లేశ్, ఆంజనేయులు ఉన్నారు.