ఈ వారం మరో 6 మెయిన్‌‌‌‌బోర్డ్ ఐపీఓలు.. రూ.3,825 కోట్ల సేకరణ

ఈ వారం మరో 6 మెయిన్‌‌‌‌బోర్డ్ ఐపీఓలు.. రూ.3,825 కోట్ల  సేకరణ

ముంబై: ఐపీఓల జోరు కొనసాగుతోంది. ఈ వారం 6 మెయిన్‌‌‌‌బోర్డ్ ఇష్యూలు మొత్తం రూ.3,825 కోట్లు సేకరించేందుకు సిద్ధమయ్యాయి. బిజినెస్‌‌‌‌ను విస్తరించడానికి, అప్పుల చెల్లింపునకు, వర్కింగ్ క్యాపిటల్ అవసరాల కోసం ఈ నిధులను వాడనున్నాయి.

ఐపీఓల వివరాలు..
* హిల్ హౌస్ ఇన్వెస్ట్‌‌‌‌మెంట్‌కు వాటాలున్న ఎలివేట్ క్యాంపసెస్ రూ.2,100 కోట్లు సేకరించనుంది. ఈ కంపెనీ ఐపీఓ సెప్టెంబర్ 23, 24, 25 తేదీల్లో ఓపెన్‌‌‌‌లో ఉంటుంది. ప్రైస్ బ్యాండ్‌‌‌‌ రూ.343-–362 గా నిర్ణయించారు.

* టైల్స్ తయారీ సంస్థ వర్మోరా గ్రానైటోకి చెందిన రూ.708 కోట్ల ఐపీఓ ఈ నెల 22 న ఓపెనై, 24 న ముగుస్తుంది. ఒక్కో షేరును రూ.140–148 రేంజ్‌‌‌‌లో అమ్మనున్నారు.

* బెంగళూరుకు చెందిన ఏ–వన్ స్టీల్స్ ఇండియా రూ.405 కోట్లు, రెన్యూవబుల్ ఎనర్జీ సంస్థ ఆర్మీ ఇన్‌‌‌‌ఫోటెక్ రూ.300 కోట్లు, పవర్ డిస్ట్రిబ్యూషన్ సేవలు ‌‌‌‌ అందించే స్వస్తిక ఇన్‌‌‌‌ఫ్రా రూ.161 కోట్లు, అడ్రాయిట్ ఇండస్ట్రీస్ (ఇండియా) రూ.151 కోట్లు చొప్పున సమీకరించేందుకు ఐపీఓకి వస్తున్నాయి.

వీటి పబ్లిక్ ఇష్యూలు ఈ నెల 23,24,25 తేదీల్లో ఉంటుంది. సెప్టెంబర్‌‌‌‌లో ఇప్పటికే 17 ఇష్యూలు ముగియగా, ఎన్‌‌‌‌ఎస్‌‌‌‌ఈ మెగా ఐపీఓ బిడ్డింగ్ ప్రస్తుతం నడుస్తోంది.