
భైంసా, వెలుగు: ఇటీవల మహబూబ్నగర్ జిల్లా నెల్లికోడూరులో నిర్వహించిన ఎస్జీఎఫ్ఐ అండర్ -17, 19 క్రీడా పోటీల్లో నిర్మల్జిల్లాకు చెందిన ఆరుగురు విద్యార్థులు ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.
అండర్-17లో 36 కేజీల విభాగంలో డి.రాజేశ్వరి (భైంసా), 40 కేజీల విభాగంలో కృష్ణ (బాసర) గోల్డ్మెడల్ సాధించారు. 52 కేజీల విభాగంలో యువరాజు(బాసర), 56 కేజీల విభాగంలో రాంచరణ్(భైంసా), 60 కేజీల విభాగంలో అరవింద్(బాసర) సిల్వర్ మెడల్ దక్కించుకు న్నారు.
వీరు అక్టోబర్ 27 నుంచి జమ్మూకాశ్మీర్లోని శ్రీనగర్లో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని జిల్లా క్రీడల అధికారి రవీందర్ రెడ్డి తెలిపారు. విద్యార్థులను డీఈవో భోజన్న అభినందించారు.