మునుపటితో పోలిస్తే హెల్త్ సర్వీస్ @ హోమ్ కు ఐదారు రెట్లు పెరిగిన క్లైంట్లు

మునుపటితో పోలిస్తే హెల్త్ సర్వీస్ @ హోమ్ కు ఐదారు రెట్లు పెరిగిన క్లైంట్లు

హైదరాబాద్, వెలుగు: కరోనా టైంలో ఎక్కువగా వినియోగించుకున్న ‘హెల్త్​సర్వీసెస్ ఎట్​హోమ్’​కు ప్రస్తుతం డిమాండ్ మరింత పెరిగింది. హాస్పిటళ్లకు వెళ్లి పేషెంట్ల మధ్య కూర్చొని, ఓపీ నంబర్​వచ్చే వరకు వేచి ఉండకుండా, డాక్టర్​నే ఇంటికి పిలిపించుకుంటున్నారు. హాస్పిటల్​కు వెళ్తే అయ్యే ఖర్చుతో ఇంటికే వచ్చి వైద్యం చేస్తుండడంతో ఏ చిన్న అనారోగ్య సమస్య వచ్చినా జనం ఈ సర్వీసును వినియోగించుకుంటున్నారు. కరోనా టెస్ట్‌‌లు మినహాయిస్తే మిగతా టెస్ట్‌‌లకు డిమాండ్ పెరిగిందని ఈ సర్వీసులు​అందిస్తున్న కంపెనీల నిర్వాహకులు చెబుతున్నారు. మునుపటితో పోలిస్తే క్లైంట్లు ఐదారు రెట్లు పెరిగారని అంటున్నారు. గతంలో ల్యాబ్ టెస్టులకు కావాల్సిన శాంపిల్స్ మాత్రమే ఇంటికి వెళ్లి కలెక్ట్ చేసేవారు. ఇప్పుడు బ్లడ్ ప్రెజర్, బ్లడ్ టెస్టుల నుంచి సివియర్ హెల్త్ టెస్ట్ ల వరకు అన్ని ఇంట్లోనే చేస్తున్నామని చెబుతున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా యాప్స్, వెబ్ సైట్స్ అందుబాటులోకి తెచ్చారు.

అన్ని రకాల సేవలు

డాక్టర్, నర్స్ విజిట్‌‌తోపాటు, ఫిజియోథెరపీ, ల్యాబ్ టెస్టులు, ఈసీజీ, ఎక్స్ రే, వ్యాక్సిన్, మెడికల్ ఎక్విప్మెంట్, ఫార్మసీ సర్వీసులు అందుబాటులో ఉంటున్నాయి. పేషెంట్ అవసరాన్ని బట్టి ఇంటికి జనరల్ ఫిజిషియన్, ఆర్థోపెడిషియన్, పల్మనాలజిస్ట్ ని పంపిస్తున్నారు. నర్స్ లు వెళ్లి డ్రెస్సింగ్ చేయడం, బీపీ, యూరిన్ డ్యూ, మోషన్ ఎనిమా చెక్ చేస్తున్నారు. కంప్లీట్ నర్సింగ్ కేర్ కూడా అందిస్తున్నారు. అలాగే ఫిజియోథెరపీ, ఫార్మసీ డెలివరీ, మెడికల్ ఎక్మిప్మెంట్ లో భాగంగా ఆక్సిజన్ సిలిండర్లు, పోర్టబుల్ వెంటిలేటర్లు రెంటుకు ఇస్తున్నారు. అన్ని రకాల ఫ్లూ వ్యాక్సిన్లు ఇస్తున్నారు. అంబులెన్స్ లు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మునుపటితో పోలిస్తే హోమ్ సర్వీసులు అందిస్తున్న సంస్థలు పెరుగుతున్నాయి. గతంలో ఐదారు ఉంటే ఇప్పుడు డయాగ్నోస్టిక్ సెంటర్లు, కార్పొరేట్ హాస్పిటల్స్ సైతం హెల్త్ సర్వీసెస్ ఆన్ వీల్స్ ని ప్రొవైడ్ చేస్తున్నాయి. కార్డియాలజిస్ట్, పల్మనాలజిస్ట్, న్యూరాలజిస్ట్, జనరల్ ఫిజిషియన్ డాక్టర్లు ఉంటున్నారు. నేరుగా పేషెంట్ ఇండ్లకు వెళ్లి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఫ్యాక్చర్ అయిన పేషెంట్లు హాస్పిటల్ కి వెళ్లలేకపోతే వీరే ఇంటికి ఎక్స్ రే మిషన్ పంపించి ఎక్స్ రే తీసి రిపోర్ట్​ ఇస్తున్నారు. ఫ్యాక్చర్ ఉంటే ఆర్థోపెడిషియన్ వచ్చి ట్రీట్​మెంట్​చేస్తున్నారు. 

10 రెట్లు అధికంగా..

కరోనా కంటే ముందు నుంచే హెల్త్ ఎట్ హోమ్ సర్వీస్​అందిస్తున్నాం. లాక్​డౌన్​టైంలో కొవిడ్​టెస్టులు ఎక్కువగా చేయించుకున్నారు. ఇప్పుడు అంతకు10 రెట్లు క్లైంట్లు పెరిగారు. జనరల్, మాస్టర్‌‌‌‌ టెస్ట్‌‌ల నుంచి డాక్టర్ విజిట్, వీడియో కన్సల్టేషన్ సేవలు వినియోగించుకుంటున్నారు. మా దగ్గర తొమ్మిది బైక్స్ ఉన్నాయి. ప్రతిరోజు ఒక్కో టెక్నిషియన్ బైక్ పై వెళ్లి శాంపిల్స్ కలెక్ట్ చేసుకుని వస్తారు. బయట టెస్టుల రేట్లు, ఇక్కడా ఒకేలా ఉన్నాయి. కొన్నిసార్లు ఆఫర్లు కూడా ఇస్తున్నాం. రోజుకు 40కి పైగా బుకింగ్స్ అవుతున్నాయి.

- డా.చల్లా చైతన్య, ఫౌండర్, హెల్త్ ఎట్ హోమ్స్

డైలీ 15 నుంచి 20 కాల్స్​వస్తున్నయ్

కరోనా టైంలో హెల్త్​ సర్వీసులకు ఫుల్​డిమాండ్ ఏర్పడింది. ప్రస్తుతం కరోనా టెస్టులు కాకుండా జనరల్, రెగ్యులర్ చెకప్‌‌ల కోసం ఎక్కువ కాల్స్​వస్తున్నాయి. ఇంటికి వచ్చి  ట్రీట్​మెంట్​చేసే కంపెనీలు పెరిగాయి. డయాగ్నోస్టిక్ సెంటర్లు, హాస్పిటళ్లు ఈ సేవలు అందిస్తున్నాయి. బీపీ, కొలస్ట్రాల్, థైరాయిడ్ వంటి హెల్త్ చెకప్‌‌ల కోసం బుకింగ్స్ అవుతున్నాయి. రోజుకి 15 నుంచి 20 కాల్స్ వస్తున్నాయి.

- సత్యనారాయణరాజు, నిర్వాహకుడు, హెల్దీ హోమ్స్, థైరో కేర్ సర్వీసెస్ సెంటర్