మన్యంకొండ ఆలయ గోపురంపై ఆకాశదీపం

మన్యంకొండ ఆలయ గోపురంపై ఆకాశదీపం

మహబూబ్ నగర్ రూరల్, వెలుగు: మన్యంకొండ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో కార్తీక మాసం ప్రారంభమైన సందర్భంగా బుధవారం ప్రధాన ఆలయం ముందు ఉన్న గోపురంపై ఆకాశదీపం వెలిగించారు. ఆకాశదీపం వెలిగించడం ఆనాదిగా ఆనవాయితీగా వస్తుందని, ఈ దీపం కార్తీకమాసంలో నెల రోజులపాటు వెలిగిస్తామని ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త ఆళ్లహరి మధుసూదన్  కుమార్  తెలిపారు.