పొరపాటు జరిగింది.. చైనా జెండా రావడంపై తమిళనాడు ప్రభుత్వం రియాక్షన్..

పొరపాటు జరిగింది.. చైనా జెండా రావడంపై తమిళనాడు ప్రభుత్వం రియాక్షన్..

ఇస్రో రాకెట్ పై చైనా జెండాతో కూడిన ఫోటోను విడుదల చేసిన ఘటనపై తమిళనాడు మంత్రి అనిత రాధాకృష్ణన్ స్పందించారు. పత్రికా ప్రకటనలో తమ వల్ల చిన్న పొరపాటు జరిగిందని చెప్పారు. ‘‘కులశేఖరపట్నం ప్రాంతంలో రాకెట్ లాంచ్ ప్యాడ్ ఏర్పాటుకు సంబంధించి మేం ఇచ్చిన వార్తాపత్రిక ప్రకటనలో చిన్న పొరపాటు జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీకి స్వాగతం పలుకుతూ ప్రకటనలో చైనా జెండా బొమ్మను రూపొందించింది తమ దృష్టికి రాని ప్రకటన"  అని అనితా రాధాకృష్ణన్ తెలిపారు.

  చైనా పట్ల డీఎంకేకు ఉన్న నిబద్ధత నిదర్శనం : అన్నామలై

రాష్ట్రంలో ఇస్రో ప్రతిపాదిత రెండవ లాంచ్ ప్యాడ్‌ను ప్రచారం చేసే రాకెట్ ప్రకటనలో అధికార ద్రవిడ మున్నేట్ర కజగం పార్టీ 'చైనా జెండా'ను ఉపయోగించిందని తమిళనాడు బీజేపీ అధ్యక్షడు కే. అన్నామలై విమర్శలు గుప్పించారు. ఈ ప్రకటన చైనా పట్ల డీఎంకేకు ఉన్న నిబద్ధతకు, మన దేశ సార్వభౌమాధికారాన్ని పూర్తిగా విస్మరిస్తున్నదనడానికి నిదర్శనమని ఆరోపించారు.