లంచం తీసుకుంటూ పట్టుబడ్డ బీజేపీ ఎమ్మెల్యే కొడుకు.. బయటపడ్డ కీలక సాక్ష్యాలు

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ బీజేపీ ఎమ్మెల్యే కొడుకు.. బయటపడ్డ కీలక సాక్ష్యాలు

కర్నాటకలోని చెన్నగిరి బీజేపీ ఎమ్మెల్యే కె. మదల్ విరూపాక్షప్ప కొడుకు ప్రశాంత్ మదల్‌ ఇటీవల ఒక వ్యాపారి దగ్గర రూ.4 0 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ విషయం చర్చనీయాంశంగా మారింది. అయితే, లంచం ఇస్తున్న సంఘటను వ్యాపారి శ్రేయస్ కశ్యప్ తన స్మార్ట్ వాచ్ లో రికార్డు చేశాడు. అందులో శ్రేయస్  బలవంతంగా లంచం ఇస్తున్న విషయం,  వ్యాపారితో జరిగిన సంభాషణంతాబయటపడింది. ఈ సాక్ష్యాధారాలతో శ్రేయస్  పోలీసులను ఆశ్రయించి కేసు నమోదు చేశాడు. యాక్షన్ తీసుకున్న పోలీసులు ప్రశాంత్ మదల్‌ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 

ప్రశాంత్ శ్రేయస్ దగ్గరనుంచి రూ. 1.7 కోట్లు డిమాండ్ చేశాడు. దాంట్లో రూ.40 లక్షలు ఇస్తుండగా ప్రశాంత్ పట్టుబడ్డాడు. దాంతో పాటు ఆయన కార్యాలయం నుంచి రూ, కోటి అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు కర్ణాటక లోకాయుక్త తెలిపింది. సబ్బులు, ఇతర డిటర్జెంట్ల తయారీకి అవసరమైన ముడిసరుకు డీల్‌ ఇచ్చేందుకు కాంట్రాక్టర్‌ నుంచి ప్రశాంత్ లంచం తీసుకుంటూ పట్టుబడ్డట్టు తెలుస్తోంది. ఇక తాజాగా ప్రశాంత్ నివాసంలో అధికారులు సోదాలు నిర్వహించగా రూ.6 కోట్లు దొరికాయి. అంతకుముందు ప్రశాంత్ మదల్ టేబుల్‌పై కుప్పలుగా పోసిన నగదుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.