హైదరాబాద్, వెలుగు: నాన్–బ్యాకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (ఎన్‌బీఎఫ్‌సీ) ఎస్‌ఎమ్‌ఎఫ్‌జీ ఇండియా క్రెడిట్ కంపెనీ లిమిటెడ్ నవీ ముంబైలో తమ 1000వ శాఖను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. ఈ సందర్భానికి గుర్తుగా ఒక పోస్టల్ కవర్‌ను, స్టాంపును విడుదల చేయడానికి ఎస్‌ఎమ్‌ఎఫ్‌జీ ఇండియా క్రెడిట్ ఇండియా పోస్ట్‌తో చేతులు కలిపింది. ఎస్‌ఎమ్‌ఎఫ్‌జీ 2007 లో ప్రారంభమైంది. ప్రస్తుతం 670 పట్టణాలలోనూ, 70 వేల గ్రామాల్లోనూ సేవలు అందిస్తోంది.
కంపెనీలో 23 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. గడచిన రెండేళ్లలో, ఎస్‌ఎమ్‌ఎఫ్‌జీ ఇండియా క్రెడిట్ దాదాపు 300 శాఖలను ప్రారంభించింది. వీటిలో గణనీయంగా 95 శాతం శాఖలు చిన్న పట్టణాలు, నగరాల్లో ఏర్పాటు అయ్యాయని సంస్థ తెలిపింది.