వర్షంలో దేవుడికి గొడుగు పట్టిన బుడ్డొడు!

V6 Velugu Posted on Jul 20, 2021

న్యూఢిల్లీ: కల్మషం లేని ప్రేమకు కేరాఫ్ ​పసితనం! పిల్లలు దేవుడితో సమానం అని అందుకే అంటారేమో!  దేవుడు కనిపిస్తే ఎవరైనా సరే.. దేవుడా నాకు అదివ్వూ.. నాకు ఇదివ్వూ అంటూ వరాలు కోరుకుంటారు. దేవుడి కోసం ఏదోకటి చేయాలని అనుకునేది కొద్దిమందే ఉంటారు. కానీ ఈ పసివాడు మాత్రం తెలిసీ తెలియని వయసులోనే దేవుడి మీద స్వచ్ఛమైన ప్రేమను చూపిస్తున్నాడు. వర్షంలో పాండురంగ స్వామి తడిచి పోతున్నాడని గొడుగు పట్టాడు. ఈ ఫొటో ఎక్కడిదో ఏమో తెలియదు కానీ కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. ‘డివోషనల్’ అన్న క్యాప్షన్‌తో ఈ రోజు (మంగళవారం) ఉదయం ఆమె షేర్‌‌ చేసిన ఈ ఫొటోకు 8 గంటల గ్యాప్‌లోనే దాదాపు 45 వేల మందికి పైగా లైక్ కొట్టారు. స్వచ్ఛమైన ప్రేమకు చిహ్నం, పసిపిల్లల హృదయం స్వచ్ఛమైనది, తొలి ఏకాదశి శుభాకాంక్షలు, జై శ్రీ కృష్ణ, జై జగన్నాథ, జై విఠల అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

 

Tagged instagram, Smriti Irani, Kid, Lord Krishna, devotion, umbrella

Latest Videos

Subscribe Now

More News