
- మైగ్రెంట్స్‌కు సాయం చేసినందుకు థ్యాంక్స్
న్యూఢిల్లీ: వలస కార్మికులు ఇళ్లకు చేరుకునేందుకు హెల్ప్ చేసిన బాలీవుడ్ యాక్టర్ సోనూసూద్‌పై కేంద్ర మంత్రి స్మృతిఇరానీ ప్రశంసలు కురిపించారు. ఈ కష్టకాలంలో పేదలను ఆదుకునందుకు థ్యాంక్స్ చెప్పారు. “ రెండు దశాబ్దాలు ప్రొఫెషనల్‌గా నీతో కలిసి పనిచేసే భాగ్యం లభించింది. మీరు నటుడిగా చాలా ఎదిగారు. మీలో ఉన్న దయ నన్ను కదిలించింది. అవసరంలో ఉన్న వారికి సాయం చేసినందుకు థ్యాంక్స్” అని స్మృతి ఇరానీ అన్నారు. లాక్‌డౌన్ కారణంగా పనులు లేక ఇబ్బందుల్లో ఉన్న కార్మికులను సొంతూళ్లకు చేర్చేందుకు సోనూసూద్ సొంత ఖర్చులతో బస్సులను ఏర్పాటు చేశారు.