Sobhita Dhulipala: శోభిత కట్టిన ఈ చీర ధర సుమారు రూ.4 లక్షలు.. ఆ బ్రాండ్‌ ప్రత్యేకత ఇదే !

Sobhita Dhulipala: శోభిత కట్టిన ఈ చీర ధర సుమారు రూ.4 లక్షలు.. ఆ బ్రాండ్‌ ప్రత్యేకత ఇదే !

ముంబై వేదికగా (2025 వేవ్స్ సమిట్) మొదటి రోజు అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకలో నటి శోభితా ధూళిపాళ, తన భర్త నాగ చైతన్యతో కలిసి హాజరైంది. ఇందులో భాగంగా శోభితా అభిమానులతో కలిసి ఫోటోలకు పోజులిచ్చింది. అయితే, ఆ ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందుకు కారణం శోభిత కట్టిన చీర ధర సుమారు రూ.4లక్షలు ఉండటం. 

ప్రత్యేకత:

ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా రూపొందించిన ఆలివ్ గ్రీన్ టిష్యూ ఎంబ్రాయిడరీ చీర సెట్‌లో శోభిత అద్భుతంగా కనిపించింది. దీని విలువ రూ.3,95,000లు. ఒక్కసారిగా ఈ చీర ధర తెలిసాక వ్వావ్.. అంటూనే షాక్ అవుతున్నారు నెటిజన్స్. మరి ఈ చీర యొక్క ప్రత్యేకత అలాంటిదని మరికొందరు పోస్టులు పెడుతున్నారు.

►ALSO READ | KA Movie: దాదా సాహెబ్‌ ఫాల్కే ఫిల్మ్‌ ఫెస్టివల్‌.. ఉత్తమ చిత్రంగా ‘క’ మూవీకి అవార్డు

ఈ చీర సెలబ్రిటీ స్టైలిస్ట్ అమీ పటేల్ చేత అలంకరించబడింది. గోధుమ-బంగారు రంగు ఎంబ్రాయిడరీతో వినూత్నమైన శైలిలో తయారుచేయబడింది.ఆ చీరకు మ్యాచింగ్ ఆలివ్ గ్రీన్ బ్లౌజ్‌తో శోభిత అద్భుతంగా ఉండేలా డిజైన్ చేయబడింది. అందుకు తగ్గట్టుగా ఆమె జుట్టును క్రిస్పీ బన్‌లో కట్టుకుని, హెయిర్ పార్టిషన్‌లో ఎర్రటి సిందూర్‌ను పెట్టుకోవడంతో నెటిజన్లను ఈ ఫోటోలు ఆకర్షిస్తున్నాయి. 

నటి శోభితా ధూళిపాళ తన గ్లామరస్ గా ఫోటోలు దిగితే హాలీవుడ్ రేంజ్ లో ఉంటుందని.. నెటిజన్స్ ఎప్పటినుంచో మాట్లాడుకుంటున్నారు. ఇక లేటెస్ట్ శోభితా చీర కట్టును చూసాక మరొక అభిప్రాయానికి వచ్చారు. అద్భుతమైన చీరలో, అందుకు తగిన ఆభరణాలతో రాజరిక వైబ్‌ను తీసుకొచ్చిందని అంటున్నారు. అలాగే, చీరకు తగ్గ నగలు, దానికి సరిపోయే చెవిపోగులు, అట్రాక్ట్ చేసే డైమండ్ నెక్లెస్‌ను చూసి ఫ్యాన్స్ మెస్మరైజ్ అవుతున్నారు.