ప్రిక్వార్టర్స్‌‌‌‌‌‌‌‌లో 4-1తో సౌత్‌‌‌‌‌‌‌‌ కొరియాపై బ్రెజిల్‌‌‌‌‌‌‌‌ ఘన విజయం

ప్రిక్వార్టర్స్‌‌‌‌‌‌‌‌లో 4-1తో సౌత్‌‌‌‌‌‌‌‌ కొరియాపై బ్రెజిల్‌‌‌‌‌‌‌‌ ఘన విజయం

క్వార్టర్‌‌‌‌‌‌‌‌ ఫైనల్లో బ్రెజిల్‌‌‌‌‌‌‌‌ 

దోహా:  గాయం నుంచి కోలుకున్న సూపర్ స్టార్‌‌‌‌‌‌‌‌, కెప్టెన్‌‌‌‌‌‌‌‌ నెయ్‌‌‌‌‌‌‌‌మార్‌‌‌‌‌‌‌‌ వచ్చాడు. గ్రౌండ్‌‌‌‌‌‌‌‌లో తన మార్కు చూపెడుతూ  గోల్‌‌‌‌‌‌‌‌ కొట్టాడు. ఫిఫా వరల్డ్‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‌‌‌‌‌లో  బ్రెజిల్‌‌‌‌‌‌‌‌ను  క్వార్టర్​ ఫైనల్​ చేర్చాడు. తమ దేశ లెజెండరీ ప్లేయర్‌‌‌‌‌‌‌‌ పీలే హెల్త్‌‌‌‌‌‌‌‌ కండిషన్‌‌‌‌‌‌‌‌పై ఆందోళనగా ఉన్న ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌లో జోష్‌‌‌‌‌‌‌‌ నింపాడు.   సోమవారం అర్ధరాత్రి జరిగిన ప్రిక్వార్టర్‌‌‌‌‌‌‌‌ ఫైనల్లో ఫస్టాఫ్​లోనే నాలుగు గోల్స్​తో చెలరేగిన సాంబా జట్టు   4–1తో  సౌత్‌‌‌‌‌‌‌‌ కొరియాను చిత్తుగా ఓడించింది. వినిసియస్​ జూనియర్​ (7వ నిమిషంలో), నెయ్​మార్​ (13వ ని.), రిచార్లిసన్​ (29వ ని), లూకాస్​ పక్వెటా (36వ ని.) తలో గోల్​ చేశారు. కొరియా టీమ్​లో ఏకైక గోల్​ సెయుంగ్​ హో (76వ ని) సాధించాడు. ఐదు సార్లు విన్నర్​ బ్రెజిల్‌‌‌‌‌‌‌‌ వరల్డ్‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‌‌‌‌‌లో క్వార్టర్స్‌‌‌‌‌‌‌‌ చేరడం 15వ సారి. శుక్రవారం జరిగే క్వార్టర్​ ఫైనల్లో క్రొయేషియాతో బ్రెజిల్​ పోటీ పడనుంది. 

గోల్స్‌‌‌‌‌‌‌‌ మోత

గ్రూప్‌‌‌‌‌‌‌‌ స్టేజ్‌‌‌‌‌‌‌‌ చివరి మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో కామెరూన్‌‌‌‌‌‌‌‌ చేతిలో అనూహ్య ఓటమి నుంచి తేరుకున్న బ్రెజిల్‌‌‌‌‌‌‌‌ నాకౌట్‌‌‌‌‌‌‌‌కు రాగానే పంజా విసిరింది. స్టార్టింగ్‌‌‌‌‌‌‌‌ నుంచే  పూర్తిగా ఎటాకింగ్‌‌‌‌‌‌‌‌ గేమ్‌‌‌‌‌‌‌‌ ఆడింది.  సౌత్‌‌‌‌‌‌‌‌ కొరియా డిఫెన్స్‌‌‌‌‌‌‌‌లోకి చొచ్చుకెళ్లి దాడులు చేసింది. బ్రెజిల్‌‌‌‌‌‌‌‌ ఫార్వర్డ్స్‌‌‌‌‌‌‌‌ను నిలువరించలేక కొరియన్స్​ చేతులెత్తేశారు. ఈ క్రమంలో ఏడో నిమిషంలో రఫిన్హ నుంచి ఇన్​సైడ్​ ఏరియాలో క్రాస్​ అందుకున్న వినిసియస్​ బాల్​ను నెట్​లోకి పంపి బ్రెజిల్‌‌‌‌‌‌‌‌కు తొలి గోల్‌‌‌‌‌‌‌‌ అందించాడు. ఐదు నిమిషాల తర్వాత బాక్స్‌‌‌‌‌‌‌‌లో రిచార్లిసన్‌‌‌‌‌‌‌‌ను ప్రత్యర్థి కిందపడేయడంతో రిఫరీ బ్రెజిల్‌‌‌‌‌‌‌‌కు పెనాల్టీ ఇచ్చాడు. బాల్‌‌‌‌‌‌‌‌ను ముద్దు పెట్టుకొని.. లో షాట్‌‌‌‌‌‌‌‌లో సింపుల్‌‌‌‌‌‌‌‌గా గోల్‌‌‌‌‌‌‌‌ చేసిన నెయ్‌‌‌‌‌‌‌‌మార్‌‌‌‌‌‌‌‌ లీడ్‌‌‌‌‌‌‌‌ను డబుల్‌‌‌‌‌‌‌‌ చేశాడు. ఈ టోర్నీలో తనకిదే తొలి గోల్‌‌‌‌‌‌‌‌ కావడం విశేషం. పావుగంటలోపే రెండు గోల్స్‌‌‌‌‌‌‌‌ వచ్చినా.. సాంబా ప్లేయర్లు దూకుడు తగ్గించలేదు. పర్‌‌‌‌‌‌‌‌ఫెక్ట్‌‌‌‌‌‌‌‌ పాస్‌‌‌‌‌‌‌‌లతో  ప్రత్యర్థి డిఫెన్స్‌‌‌‌‌‌‌‌ను బ్రేక్‌‌‌‌‌‌‌‌ చేస్తూ ముందుకెళ్లారు. ఈ క్రమంలో బాక్స్‌‌‌‌‌‌‌‌ అవతల తలతో బాల్‌‌‌‌‌‌‌‌ను అద్భుతంగా కంట్రోల్‌‌‌‌‌‌‌‌ చేసి తన స్కిల్స్‌‌‌‌‌‌‌‌ చూపెట్టిన రిచార్లిసన్ తిరిగి తియాగో సిల్వ నుంచి పాస్‌‌‌‌‌‌‌‌ అందుకొని గోల్‌‌‌‌‌‌‌‌ కొట్టాడు. ఆ వెంటనే లూకాస్‌‌‌‌‌‌‌‌ సాంబా జట్టుకు నాలుగో గోల్​ అందించాడు. ఇక ఫస్టాఫ్‌‌‌‌‌‌‌‌లో తేలిపోయిన కొరియా సెకండాఫ్‌‌‌‌‌‌‌‌లో బాల్‌‌‌‌‌‌‌‌ను కంట్రోల్‌‌‌‌‌‌‌‌లోకి తెచ్చుకొని ఎటాక్‌‌‌‌‌‌‌‌ చేసింది. ఓ ప్రయత్నాన్ని  బ్రెజిల్‌‌‌‌‌‌‌‌ కీపర్‌‌‌‌‌‌‌‌ డిఫెండర్లు అడ్డుకోగా.. కాసేపటికి దక్కిన ఫ్రీ కిక్‌‌‌‌‌‌‌‌కు సెయుంగ్‌‌‌‌‌‌‌‌ కొరియాకు తొలి గోల్‌‌‌‌‌‌‌‌ అందించాడు. ఈ తర్వాత మరో గోల్‌‌‌‌‌‌‌‌ రాకపోవడంతో ఆ జట్టు చిత్తవగా.. బ్రెజిల్‌‌‌‌‌‌‌‌ ఘన విజయం సొంతం చేసుకుంది. 

76 వరల్డ్‌‌‌‌‌‌‌‌కప్స్‌‌‌‌‌‌‌‌లో నెయ్‌‌‌‌‌‌‌‌మార్‌‌‌‌‌‌‌‌కు ఇది మూడో గోల్‌‌‌‌‌‌‌‌. బ్రెజిల్‌‌‌‌‌‌‌‌ తరఫున ఓవరాల్‌‌‌‌‌‌‌‌గా 76వది. తమ దేశం తరఫున అత్యధిక గోల్స్‌‌‌‌‌‌‌‌ చేసిన పీలే (77) రికార్డును అందుకునేందుకు మరో గోల్‌‌‌‌‌‌‌‌ దూరంలో నిలిచాడు.