భార్య గొంతు, చేతులు, కాళ్లు కట్ చేసి చంపిన సాఫ్ట్‎వేర్ ఇంజినీర్

V6 Velugu Posted on Sep 26, 2021

కామారెడ్డి: భార్య గొంతు, కాళ్ళు, చేతులు కోసి దారుణంగా హత్య చేసిన ఘటన ప్రగతినగర్‎లో జరిగింది. అనంతరం భర్త కూడా గొంతు కోసుకొని ఆత్మహత్యయత్నం చేశాడు. వివరాలలోకి వెళ్తే.. కామారెడ్డి జిల్లా గాంధారి మండలానికి చెందిన పుట్టల గంగారాం.. దేవునిపల్లిలో స్థిరపడ్డారు. ఆయన కూతురు సుధారాణిని.. కామారెడ్డికి చెందిన ఎర్రోల కిరణ్ కుమార్‎కు ఇచ్చి గత నెల 27న వివాహం జరిపించారు. పెళ్లి సమయంలో కట్నంగా రూ. 14 లక్షల నగదు, ఒక ఫ్లాట్, 10 తులాల బంగారం ఇచ్చారు. వృత్తిరిత్యా సాఫ్ట్‎వేర్ ఇంజినీర్ అయిన కిరణ్.. ప్రగతినగర్‎లోని శ్రీ సాయి ద్వారకా అపార్ట్‎మెంట్‎లో నివాసముండేవాడు. పెళ్లి తర్వాత కొత్త దంపతులు హైదరాబాద్‎కు వచ్చారు. ఏం జరిగిందో ఏమో కానీ, కొన్ని రోజుల క్రితం కిరణ్.. సుధారాణిని గొంతుపిసికి హత్యయత్నం చేశాడు. దాంతో సుధారాణి తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయింది. పెద్దలు కిరణ్ కుమార్ ను పిలిచి రాజీ చేయడంతో గొడవ సద్దుమణిగింది. దాంతో కిరణ్ తల్లిదండ్రులతో కలిసి సుధారాణిని తీసుకొని వారం కిందట మళ్లీ హైదరాబాద్‎కు చేరుకున్నాడు.

అయితే సుధారాణిని చూడటానికి రావాల్సిందిగా కిరణ్ తల్లిదండ్రులు.. ఆమె తల్లిదండ్రులకు శనివారం ఫోన్ చేశారు. అనంతరం కిరణ్ తల్లిదండ్రులు కామారెడ్డికి వెళ్లిపోయారు. సుధారాణి అత్తామామల కోరిక మేరకు.. సుధారాణి తల్లిదండ్రులు మధ్యాహ్నం 1 గంట వరకు హైదరాబాద్ కు చేరుకున్నారు. ఇంటి డోర్ పెట్టి ఉండటంతో ఎంత పిలిచినా ఎవరూ పలకలేదు. మధ్యాహ్నం కావడంతో పడుకున్నారేమో అనుకొని 3 గంటల వరకు వెయిట్ చేశారు. మళ్లీ వెళ్లి పిలిచినా పలకకపోవడంతో.. రాత్రి 9 గంటలకు పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. తలుపులు పగులగొట్టి చూడగా.. సుధారాణి బెడ్ మీద విగతజీవిగా పడి ఉంది. ఆమె చేతులు, కాళ్లు, గొంతు కట్ చేసి ఉన్నాయి. పక్కనే కిరణ్ కూడా చేయి, గొంతు కోసుకొని పడి ఉన్నాడు. పోలీసులు వెంటనే కిరణ్‎ను నిజాంపేటలోని హోలిస్టిక్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం కిరణ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సుధారాణిని కిరణ్ కుమార్ చంపాడనే కోపంతో ఆమె బంధువులు కామారెడ్డిలోని కిరణ్ ఇంటిపై దాడి చేశారు. ఇంట్లో సామాగ్రి, ఫర్నీచర్, కిరణ్ వాహనాన్ని సుధ బంధువులు ధ్వంసం చేశారు. సుధ తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆమె మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.

For More News..

పవన్ కళ్యాణ్ నటించినా.. సంపూర్ణేష్ బాబు నటించినా.. కష్టం ఒకటే

డ్యూటీకి రాకపోతే రూ.300 ఫైన్

Tagged Telangana, murder, Kamareddy, Hyderbad, newly married couple, pragathi nagar

Latest Videos

Subscribe Now

More News