పవన్ కళ్యాణ్ నటించినా.. సంపూర్ణేష్ బాబు నటించినా.. కష్టం ఒకటే

పవన్ కళ్యాణ్ నటించినా.. సంపూర్ణేష్ బాబు నటించినా.. కష్టం ఒకటే

నెల్లూరు: పవన్ కళ్యాణ్ నటించినా.. సంపూర్ణేష్ బాబు నటించినా.. కష్టం అనేది ఇద్దరిదీ ఒకటే అని ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఆన్‎లైన్ టికెట్ల పోర్టల్ గురించి చిత్ర పరిశ్రమలోని కొందరు ప్రముఖులే ప్రభుత్వ పెద్దలతో చర్చించారని ఆయన అన్నారు. అయినా ఆన్‎లైన్ పోర్టల్ అంటే ఎందుకంత భయం? దాని వల్ల జరిగే నష్టం ఏంటి? అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొని వెళ్తున్న ఆయనను.. ఆన్‎లైన్ పోర్టల్ గురించి మీడియా ప్రశ్నించడంతో మంత్రి అనిల్ పై వ్యాఖ్యలు చేశారు.

‘జవాబుదారీతనం రావాలన్నదే ముఖ్యమంత్రి ఆలోచన. పారదర్శకత కోసమే ఆన్‎లైన్ పోర్టల్. అందరికీ టికెట్ ధర ఒకేలా ఉండాలనేదే మా ఉద్దేశం. సినిమా ఖర్చులో కేవలం నలుగురైదుగురికి మాత్రమే లబ్ధి ఎక్కువగా ఉంటుంది. ఇది ఎంతవరకు సబబు? నా ఒక్కడి కోసం చిత్రసీమను వైసీపీ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని పవన్ కళ్యాణ్ మాట్లాడడం సరికాదు. ఇది పవన్ కళ్యాణ్ క్రియేషన్. చిత్రపరిశ్రమను ఇబ్బంది పెట్టే ఆలోచన మా ప్రభుత్వానికి లేదు. సీఎం జగన్‎ను ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతో పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. జగన్ చిత్ర పరిశ్రమనంతా ఇబ్బంది పెడుతున్నాడని పవన్ కళ్యాణ్ ఒక ప్రొజక్షన్ ఇచ్చుకోవడం కరెక్ట్ కాదు. రాజకీయ ఉనికి కోసం సీఎం జగన్‎ను తిట్టడం పవన్ కళ్యాణ్‎కు ఒక ఫ్యాషన్ అయిపోయింది. ‘ప్రభుత్వ తీరును మారుస్తాను. నేను రోడ్డు కొస్తే మనిషిని కాదు. బెండు తీస్తాం..’ అని పవన్ కళ్యాణ్ మాట్లాడటం చాలా సార్లు చూశాం. రెండు జెడ్పీటీసీలు, ఒక ఎంపిటీసీతో మేం ముందుకెళ్తాం అని పవన్ కళ్యాణ్ అంటున్నాడు. వారితో పైకెళ్ళే లోపు పార్టీ చాప చుట్టేయడం ఖాయం’ అని మంత్రి అనిల్ అన్నారు.

For More News..

పెళ్లైన నెలకే భార్యను గొంతు కోసి చంపిన భర్త

డ్యూటీకి రాకపోతే రూ.300 ఫైన్