
న్యూఢిల్లీ: రైల్వే ట్రాక్స్ వెంబడి ఉన్న ఇండియన్ రైల్వే స్థలాల్లో సోలార్ పవర్‌ను ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రతిపాదించింది. దీని వలన ఏడాదికి 1200 కోట్ల యూనిట్ల విద్యుత్‌ను వాడుతోన్న ఇండియన్ రైల్వేకు ఎలక్ట్రిసిటీ ఖర్చులు మిగులుతాయని నిర్మ లా చెప్పారు. ఇండియన్ రైల్వే విద్యుత్ వినియోగం ఏటికేడు ఐదు శాతం పెరుగుతోంది. దీంతో అసలే నష్టాల్లో నడుస్తున్న రైల్వే వ్యవస్థపై మరింత ఆర్థిక భారం పెరుగుతోంది. విద్యుత్ అవసరాల్లోని10 శాతం వాటాను రెన్యూబుల్ సోర్స్‌ల నుంచి పొందాలని ఈ ఏడాది ఇండియన్ రైల్వే టార్గెట్‌గా పెట్టుకుంది. ప్రస్తుతం దేశంలో 125,000 కి.మీల రైల్వే ట్రాక్‌ను ఇండియన్ రైల్వే నిర్వహిస్తోంది. ఈ ట్రాక్‌లకు ఇరువైపుల ఉన్న రైల్వే స్థలాల్లో సోలార్ పవర్ జనరేటర్లను ఏర్పాటు చేసి సోలార్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
2030 నాటికి ‘నెట్ జీరో’ కార్బన్ ఎమిటర్‌గా మారాలని ఇండియన్ రైల్వే ప్లాన్స్ వేసుకొంది. అమెరికా, చైనా తర్వాత అధికంగా గ్రీన్ హౌస్ వాయువులు ఇండియాలోనే విడుదలవుతున్నాయి. ఇండియాలో ఆయిల్ వాడకాన్ని తగ్గించి, రెన్యూబుల్ ఎనర్జీ వైపు మరలేందుకు ప్రభుత్వం ప్లాన్స్ వేస్తోంది. 2022 నాటికి దేశంలో 175 గి.వా క్లీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకొంది. ఇందులో కేవలం సోలార్ పవర్ ద్వారానే 100 గి.వాలను ఉత్పత్తి చేయాలని చూస్తోంది. విండ్ ప్రాజెక్ట్ ద్వారా 60 గి.వా ఉత్పత్తి చేయాలని ప్లాన్స్ వేస్తోంది. ప్రస్తుతం ఇండియాలో 84.39 గి.వా రెన్యూబల్ ఎనర్జీ సామర్ధ్యం ఉంది. ఇండియా రైల్వే రోజుకి 20,849 ట్రైన్‌లను నడుపుతోంది. రోజూ 2.3 కోట్ల మంది రాకపోకలు సాగిస్తుంటారు.
మరిన్ని వెలుగు వార్తలకోసం క్లిక్ చేయండి